Hyderabad: 3 కమిషనరేట్ల పరిధిలో 2 రోజుల పాటు మద్యం షాపులు బంద్.. ఎప్పట్నుంచి ఎప్పటివరకు అంటే
హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలోని మందుబాబులకు అలెర్ట్. 2 రోజులు పాటు అన్ని లిక్కర్ షాప్స్, కల్లు దుకాణాలు క్లోజ్ అవ్వనున్నాయి.
హైదరాబాద్‌లో శుక్రవారం గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఖైరతాబాద్(Khairatabad), బాలాపూర్(balapur) సహా నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు తరలి రానున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో లిక్కర్ సేల్స్‌పై ఆంక్షలు విధించింది పోలీస్ డిపార్ట్‌మెంట్. 3 కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులు, కల్లు కాంపౌండ్స్ 2 రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశించింది. శుక్రవారం(సెప్టెంబర్ 9) మార్నింగ్ 6 నుంచి, ఆదివారం(సెప్టెంబర్ 11) ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్స్, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక హుస్సేన్‌సాగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 వేల మంది పోలీస్ ఫోర్స్‌లో బందోబస్తు నిర్వహించనుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాన్ని మోనేటర్ చేయనున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద 22 క్రేన్లు అందుబాటులో ఉంచారు. వ్యర్థాల వెలికితీత కోసం 20 జేసీబీలను రెడీగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు హెల్త్ సెంటర్స్ సైతం ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఓల్డ్‌సిటీ సహా హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల పహారా మొదలైంది. ట్యాంక్‌బండ్‌కి కనెక్ట్ అయ్యే అన్ని రూట్లలోనూ, కీలక మసీదు సెంటర్లలోనూ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇదే సమయంలో హైదరాబాదీ ముస్లింలకు మత పెద్దలు పిలుపునిచ్చారు. గంగాజమునా తెహజీబ్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో శాంతి, ప్రశాంతతకే పెద్దపీటన్నారు మతపెద్ద కుబూల్ పాషా షిత్తారీ. శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడికక్కడ స్థానిక మసీదుల్లోనే చేసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..