Hyderabad: ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరిన యూట్యూబర్

|

Aug 22, 2024 | 6:45 PM

ఫాలోవర్స్ పెరగాలి.. సోషల్ మీడియాలో ఫేమ్ కావాలి. దాని కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడటం లేదు కొంతమంది. ఒక్కొక్కడికి ఒక్కో రకం పైత్యం. ఇదిగో ఇతగాడి వ్యవహారం ఏంటో తెలుసుకుందాం పదండి...

Hyderabad: ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరిన యూట్యూబర్
Influencer Throws Cash
Follow us on

డబ్బు ఎక్కువై, పదిమందికీ పంచితే అది దాతృత్వం. అదే డబ్బు ఎక్కువై.. నడిరోడ్డుపై వెదజల్లి పదిమందినీ కంగారెత్తిస్తే దాన్నేమంటాం.. డబ్బు మదం అనే కదా అనాలి. అలాంటి వ్యక్తే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని పేరే హర్ష. ఇతనో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామర్‌ అట. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడోగానీ.. కాస్తోకూస్తో అకౌంట్‌లోకి డబ్బు వచ్చిపడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్లీ వీడియోలు చేస్తున్నాడు. పెట్టుబడి అంటే.. పద్ధతిగా కాదు.. విచ్చలవిడిగా విసిరేస్తున్నాడు. కావాలంటే దిగువన చూడండి.

చూశారా.. ఇది ఫస్ట్‌ టైమ్ కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి పోస్ట్ చేసి రీల్స్ చేయడం ఇతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోడానికి జనం ఎగబడతారు. చిన్నపాటి తొక్కిసలాటలు, ట్రాఫిక్‌ జామ్‌లు ఆ టైమ్‌లో సహజం. ఆ హడావిడిని ఇన్‌స్టాలో పెట్టి మరింత సొమ్ముచేసుకుంటాడు హర్ష. ఇవే కాదు.. నడిరోడ్లపై బైక్ స్టంట్లు కూడా ఇతనికి అలవాటు.

ఇతని డబ్బు పొగరుని, రీల్స్‌ పిచ్చిని, న్యూసెన్స్‌ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. నడిరోడ్లపై ఇంత రచ్చ చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూసి మరింతమంది పెడదారి పట్టే అవకాశం ఉందని.. ఇలాంటి బ్యాచ్ సమాజానికే హానికరమంటున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..