Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో తళుక్కుమన్న హైదరాబాద్.. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ కైవసం.. అంతే కాకుండా..
హైదరాబాద్ మహా నగరానికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఓఆర్‌ఓఆర్ చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేక అభినందనలు...
హైదరాబాద్ మహా నగరానికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఓఆర్‌ఓఆర్ చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేక అభినందనలు తెలిపారు. లివింగ్ గ్రీన్ కేటగిరి కింద హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో ప్రజెంట్ చేశారు. ఈ అంతర్జాతీయ అవార్డు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. కాగా.. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ హైదరాబాద్ కావడం గమనార్హం.
ఏఐపీహెచ్ ఆరు విభాగాల్లో ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ కోసం ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరీల్లో మొత్తం 18 మంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా.. ఫైనల్ కేటగిరీల వారీగా శుక్రవారం విజేతలను ప్రకటించారు. లివింగ్ గ్రీన్ ఫర్ బయోడైవర్సిటీ (కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్), లివింగ్ గ్రీన్ ఫర్ క్లైమేట్ చేంజ్ (టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో), లివింగ్ గ్రీన్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీంగ్ (బ్రెజిల్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా), లివింగ్ గ్రీన్ ఫర్ వాటర్ (కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా), లివింగ్ గ్రీన్ ఫర్ సోషల్ కోహెషన్ (అర్జెంటీనా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్) మరియు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ & ఇన్‌క్లూజివ్ గ్రోత్ (కెనడా, ఇరాన్, ఇండియా) ఉన్నాయి.
Many congratulations & very proud of your work @HMDA_Gov @md_hgcl ? https://t.co/h8oh1fDOlQ
— KTR (@KTRTRS) October 14, 2022
ఎంపికైన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ కావడం విశేషం. హైదరాబాద్ కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం ఆరు కేటగిరీలలో ఉత్తమమైన ‘వరల్డ్ గ్రీన్ సిటీ 2022’ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ నెక్లెస్ గా పిలవబడే ORR పచ్చదనం ఈ విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బృందాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.