AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మరింత హీట్ పెంచిన మునుగోడు రాజకీయాలు.. కేసీఆర్ పిలుపుకోసం బూర వెయిటింగ్..!

మునుగోడు రాజకీయాలు రంజుగా మారాయి. బై పోల్‌ వేళ.. కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని చూస్తోన్న అధికార టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

Munugode Bypoll: మరింత హీట్ పెంచిన మునుగోడు రాజకీయాలు.. కేసీఆర్ పిలుపుకోసం బూర వెయిటింగ్..!
Boora Narsaiah Goud
Shiva Prajapati
|

Updated on: Oct 15, 2022 | 8:25 AM

Share

మునుగోడు రాజకీయాలు రంజుగా మారాయి. బై పోల్‌ వేళ.. కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని చూస్తోన్న అధికార టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఊగిసలాటకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. మాజీ ఎంపీ బూర కారు దిగేందుకు రెడీ అయ్యారు. కమలం కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు భువనగిరి మాజీ ఎంపీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్‌ఎస్‌ కీలక నేత బూర నర్సయ్యగౌడ్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన బూర.. పార్టీలో చేరికపై మంతనాలు జరిపారని టాక్ వినిపిస్తోంది. నేడో, రేపో బీజేపీలో చేరికపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.

మరోవైపు.. ఢిల్లీ పెద్దలతో బూర చర్చలు జరుపుతున్న సమయంలోనే కీలక కామెంట్స్‌ చేశారు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌. బూర నర్సయ్యగౌడ్ తనను కలవలేదని, ఆయన బీజేపీలో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఎవరు ఎప్పుడైనా చేరొచ్చన్నారు. ఇక.. ఢిల్లీలోనే ఉన్న అధినేత కేసీఆర్‌ పిలుపు కోసం బూర ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ పిలిచి బుజ్జగిస్తారన్న బూర భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోతే బీజేపీలో చేరికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన బూర నర్సయ్యగౌడ్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో పోటీ చేసిన ఆయన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. కానీ అధిష్ఠానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!