Hyderabad: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు మరో అరుదైన ఘనత.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు కైవసం..

హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుస్తూ వచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరం లోపలికి రాకుండానే సాఫీగా ప్రయాణం సాగించే వీలు కలిగింది. ప్రయాణికుల ఇబ్బందులు తీరుస్తోన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు..

Hyderabad: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు మరో అరుదైన ఘనత.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు కైవసం..
Hyderabad Orr
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 15, 2022 | 6:45 AM

హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుస్తూ వచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరం లోపలికి రాకుండానే సాఫీగా ప్రయాణం సాగించే వీలు కలిగింది. ప్రయాణికుల ఇబ్బందులు తీరుస్తోన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు మరో అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్టాత్మకమైన వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డును సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలోని బెజు నగరంలో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) కార్యక్రమంలో హైదరాబాద్‌కు ఈ అవార్డు లభించింది. ఆరు కేటగిరీల్లో వరల్డ్‌ గ్రీన్‌ సిటీస్‌ అవార్డులను ప్రకటించగా 18 దేశాలకు చెందిన నగరాలు ఫైనల్‌కు ఎంపికయ్యాయి.

ఇందుకు భారత్‌ నుంచి హైదరాబాద్ ఎంపిక కావడం విశేషం. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పచ్చదనానికి ‘లివింగ్‌ గ్రీన్‌’ విభాగంలో అవార్డు లభించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణ రాష్ట్రానికే గ్రీన్‌ నెక్లెస్‌లా ఉందని ఏఐపీహెచ్‌ అభివర్ణించింది. ఔటర్‌ రింగ్ రోడ్డుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపై మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ అధికారుల కృషిని అభినందించారు.

హైదరాబాద్‌కు వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు లభించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు ఇతర అధికారులను సీఎం అభినందించారు. తెలంగాణను మరింత ఆకుపచ్చగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపొందించేందుకు అందరూ కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..