Hyderabad: వినాయకుడి దగ్గర అఘోరాల విచిత్ర విన్యాసాలు.. గూస్ బంప్స్ వీడియో

హైదరాబాద్‌ నగర శివార్లలోని బోడుప్పల్‌ ఓల్డ్‌ విలేజ్‌ నిమజ్జనోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది.. గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వేడుకలకు నిలయంగా ఉంటాయి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో, అత్యంత వైభవంగా నవరాత్రులు జరిపారు.

Hyderabad: వినాయకుడి దగ్గర అఘోరాల విచిత్ర విన్యాసాలు.. గూస్ బంప్స్ వీడియో
Aghoris, Gorilla Dance Performances At Ganesh Visarjan

Edited By:

Updated on: Sep 05, 2025 | 5:52 PM

హైదరాబాద్‌ నగర శివార్లలోని బోడుప్పల్‌ ఓల్డ్‌ విలేజ్‌ నిమజ్జనోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది.. గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వేడుకలకు నిలయంగా ఉంటాయి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో, అత్యంత వైభవంగా నవరాత్రులు జరిపారు. ఉత్సవాల తుది ఘట్టమైన గణేష్‌ నిమజ్జనం ఊరేగింపులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అఘోరాల వేషధారణతో చేసిన నృత్యాలు… భిన్నమైన మేకప్‌, ఆకర్షణీయమైన వస్త్రధారణ, ఉత్సాహభరిత నాట్యంతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న యువకులు భక్తుల్లో ఉత్సాహం నింపారు. వారిని చూసేందుకు రోడ్లపై జనాలు గుమికూడారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ తమ మొబైళ్లలో వీడియోలు తీయడం, ఫొటోలు దిగడం కనిపించింది.

బస్తీ వాసులు గత 25 ఏళ్లుగా ఈ ఉత్సవాలను గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంప్రదాయాన్ని పాటిస్తూ, ప్రతి సంవత్సరం భక్తితో గణపతిని పూజించి, నవరాత్రులు ముగిసిన తర్వాత భారీ ఊరేగింపుతో నిమజ్జన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాకుండా, ఆనందాన్ని పంచుకునే వేదికగా మారాయి. ఈ వేడుకలలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా గణేష్‌ ఉత్సవాలకు కొత్త రంగులు అద్దుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

వీడియో చూడండి..

మరోవైపు గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఓ యువకుడు. గోరిల్లా వేషధారణలో డ్యాన్సులు వేస్తూ పిల్లల్ని అలరించాడు. ఉత్సవంలో పాల్గొన్న వారిలో ఈ యువకుడి నృత్యం ప్రతి ఒక్కరికీ నవ్వులు పంచింది. గోరిల్లా కాస్ట్యూమ్‌ తో అతని డ్యాన్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. పిల్లలంతా అతని చుట్టూ చేరి డ్యాన్స్‌ చేశారు. ఈ వేషధారణతో చేసిన డ్యాన్స్ ఊరేగింపులోహైలెట్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..