విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా.. 200 మంది టీచర్లను విదేశాలకు పంపుతాం: సీఎం రేవంత్ రెడ్డి
గత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని.. ఇందుకోసం తరచుగా టీచర్లతో పాటు విద్యావంతులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు.
గత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని.. ఇందుకోసం తరచుగా టీచర్లతో పాటు విద్యావంతులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా.. నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతున్నారు.. విమర్శలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. 10 ఏళ్ల నుంచి శాఖలో సమస్యలు అలానే ఉన్నాయి.. ప్రక్షాళన చేస్తున్నా..’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం.. కేజీ టు పీజీ అని చెప్పి.. అమలు చేయలేదని.. పదేళ్లు విద్య పేరుతో వ్యాపారం చేశారన్నారు.
ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని.. తరచుగా టీచర్లతో చర్చలు జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. పేదలకు ప్రభుత్వ స్కూల్స్‌లో మెరుగైన విద్య అందాలి.. విద్యలో ప్రపంచదేశాలతో మనం పోటీపడాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఏటా 200 మంది టీచర్లను.. విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. టీచర్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. పలువురు ఉపాధ్యాలుకు అవార్డులను అందజేశారు.
గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula ఎంతో సమయం… pic.twitter.com/XXi8EqDnTu
— Telangana CMO (@TelanganaCMO) September 5, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

