AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక వాడలో అగ్నికీలలు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాల భయానక ఘటనలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటైన మైలార్‌దేవ్‌పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. పరిశ్రమలు, గోదాముల సముదాయాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ లో ఓ టపాసుల దుకాణంలోనూ మంటలు చెలరేగాయి. 

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక వాడలో అగ్నికీలలు
Hyderabad Fire Accident
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2026 | 7:27 PM

Share

మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలోని ఒక గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న ఇతర గోదాములు, పరిశ్రమలకు కూడా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఆకాశాన్ని తాకేలా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కిలోమీటర్ల దూరం వరకు కూడా పొగ కనిపిస్తుండటంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజిన్‌లను రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చుట్టుపక్కల ఇతర పరిశ్రమలకు మంటలు విస్తరించకుండా సకాలంలో అడ్డుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన ముడిసరుకు, యంత్ర సామగ్రి, తయారైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. లేదంటే పెను ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు, ఫైర్ ఆఫీసర్లు దర్యాప్తు ప్రారంభించారు. పారిశ్రామిక వాడలలో భద్రతా ప్రమాణాలు పాటించని యూనిట్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి సీతాఫల్ మండిలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతాఫల్‌ మండిలో ఏర్పాటు చేసిన ఓ టపాసుల దుకాణంలో మంటలు చేలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, దుకాణ యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని టపాసులు మొత్తం కాలి బూడిదైనట్టుగా సమాచారం. కాగా, ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణాపాయం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, జరిగిన ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..
డబుల్ అయిన పటాకుల ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..
డబుల్ అయిన పటాకుల ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..
హామిల్టన్‌లోనూ వర్షం ముప్పు.. మూడో వన్డే జరగడం కష్టమేనా?
హామిల్టన్‌లోనూ వర్షం ముప్పు.. మూడో వన్డే జరగడం కష్టమేనా?
'రామాయణ్' పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్
'రామాయణ్' పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్
దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు.. తొమ్మిదేళ్ల తర్వాత రివర్స్‌
దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు.. తొమ్మిదేళ్ల తర్వాత రివర్స్‌
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం