Hyderabad Danger Spots: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిందో ఇక అంతే సంగతి.. డేంజర్‌ ప్రాంతాలు ఇవే!

| Edited By: Subhash Goud

Jul 20, 2023 | 9:30 PM

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని జోరు వానతో గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వానంటేనే వణికిపోతున్నాయి. గత రెండు రోజులు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే గురువారం ఒక్క పగలు..

Hyderabad Danger Spots: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిందో ఇక అంతే సంగతి.. డేంజర్‌ ప్రాంతాలు ఇవే!
Rain alert
Follow us on

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని జోరు వానతో గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వానంటేనే వణికిపోతున్నాయి. గత రెండు రోజులు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే గురువారం ఒక్క పగలు సమయంలోనే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి నగరంలోని 339 వాటర్ లాగిన్ పాయింట్స్ అన్నీ కూడా నీటితో నిండి పోయాయి. నగరంలో ఈ 339 వాటర్ లాగిన్ పాయింట్స్ డేంజర్ పాయింట్లుగా వాహనదారులు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మెయిన్ రోడ్లపై వెళ్తున్నా వాహనదారులు రోడ్డుకు సైడ్ వెళ్తే ఏ గుంతలో ఎప్పుడు ఇరుక్కుపోవాల్సి వస్తుందోనన్న భయాందోళనతో ఉన్నారు.

ముఖ్యంగా పాయింట్స్ మెయిన్ రోడ్లపై ఉన్న ప్రాంతాలను గనుక గమనిస్తే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద, లింగంపల్లి రైల్వే అండర్ పాస్, యూసఫ్ గూడా మెయిన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, ఫిల్మ్ నగర్, మూసాపెట్ మెట్రో స్టేషన్, బాలానగర్ బస్ స్టాప్, చింతల్ రోడ్, జీడిమెట్ల హై టెన్సన్ రోడ్, మలక్ పేట సహా పాతబస్తీలో పలు ఏరియాల్లో నీరు నిలిచి డేంజర్ స్పాట్స్‌గా ఉన్నాయి.

ఇక గ్రేటర్ లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. గ్రేటర్ పరిధిలో 426 జిహెచ్ఎంసి మాన్ సూన్ టీమ్స్ ను రెడీ చేసింది. దాంతోపాటు 170 కు పైగా స్టాటిక్ టిమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడ వాటర్ నిలిచిన క్లియర్ చేయడం, చెట్లు విరిగిపడిపోయినా సహాయక చర్యలు అందించేలా ఈ టీమ్స్ ను పనిచేయనున్నాయి. మరోవైపు బల్దియా లోని 185 చెరువుల పరిస్థితిని జిహెచ్ఎంసి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిహెచ్ఎంసికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఇక ఎడతెరిపిలేని వానలతో శిథిలావస్థకు చేరిన ఇండ్లు నాని కూలిపోతున్న ఘటనలు కూడా నగరంలో చోటుచేసుకున్నాయి. గురువారం ఒక్కరోజే రెండు ప్రాంతాల్లో పాత ఇల్లు కూలిపోయాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరు ఇండ్లలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కవాడిగూడలోని ఓ శిథిలావస్థకు చేరిన ఇల్లు తో పాటు బేగం బజార్లో ఓ ఇంటి పై కప్పు కూలింది. మరో రెండు రోజులపాటు ఇవే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైతే తప్ప నగర వాసులు బయటకు రావద్దని బల్దియా సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి