Hyderabad Cricket Association: రణరంగంగా మారిన హెచ్‌సీఏ ఎన్నికలు.. రాజకీయ బలంతో బరిలోకి అభ్యర్థులు..

శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్‌స్టిట్యూషన్స్‌, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంప్రదాయంగా వస్తోంది. జిల్లా క్రికెట్‌ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఇద్దరు కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత అండదండలు జగన్‌మోహన్‌రావుకు ఉన్నాయి.

Hyderabad Cricket Association: రణరంగంగా మారిన హెచ్‌సీఏ ఎన్నికలు.. రాజకీయ బలంతో బరిలోకి అభ్యర్థులు..
Hca Elections

Edited By: Venkata Chari

Updated on: Oct 17, 2023 | 1:23 PM

Hyderabad Cricket Association: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ శుక్రవారమే ఓటింగ్‌ కావటంతో ఎన్నికల్లో విజయం కోసం బరిలోని 4 ప్యానెళ్లు గెలుపు కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. నాలుగు ప్యానల్స్‌ హెచ్‌సీఏ ఎన్నికవ బరిలో నిలువగా.. ప్రధానంగా పోటీ గులాబీ వర్సెస్‌ కమలంగా కఁపిస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) మద్దతుతో జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుతుపున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన కీలక నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి తన ప్యానల్‌ను రేసులో నిలిపారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో ఈ 2 ప్యానల్స్‌ నడుమే ప్రధానంగా పోటీ కనిపిస్తుంది. అయితే వివేక్ కు చెందిన విశాక కంపెనీ-హెచ్ సీఏ మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పందం కోర్టు కేసు వివేక్ ప్యానెల్ కు ప్రతికూలంగా మారింది. విశాక కంపెనీ స్టేడియం కోసం ఖర్చు పెట్టిన రూ.4 కోట్లకు రూ.40 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్బిటేషన్ తీర్పు రావడం, అంత పెద్ద మొత్తంలో హెచ్సీఏ నిధులు ఆ కంపెనీకి ఇస్తే రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి ఏం కావాలని క్లబ్ సెక్రటరీలు అందోళన చెందుతున్నారు.

శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్‌స్టిట్యూషన్స్‌, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంప్రదాయంగా వస్తోంది. జిల్లా క్రికెట్‌ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఇద్దరు కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత అండదండలు జగన్‌మోహన్‌రావుకు ఉన్నాయి. 100 క్లబ్‌ సెక్రటరీలలో అధిక శాతం మంది జగన్‌ ప్యానల్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం అండతో హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకొస్తారనే అంశాలు జగన్‌మోహన్‌రావును రేసులో ముందంజలో నిలుపుతున్నాయి. మాజీ క్రికెటర్లు శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ అయూబ్‌లు అమర్ నాధ్ అధ్యక్షతన ఒక ప్యానల్‌తో ముందుకొచ్చినా.. ఏండ్లుగా హెచ్‌సీఏను ఏలుతున్న పెద్దలు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. హెచ్ సీఏలో అవినీతి కార్యకలాపాలకు, స్టేడియం నిర్మాణంలో అక్రమాలకు, అవినీతికి భారీ ఎత్తున అవకతవకులకు పాల్పడినట్టు వారిపై అభియోగాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్ధిగా జగన్ మోహన్ రావు..

జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంలోని గ్రూపు రాజ‌కీయాలకు, అక్ర‌మాలు, అవినీతికి స్వ‌స్తి చెప్పి త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆ క్రీడా అభివృద్ధికి కృషి చేసిన జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఇప్పుడు క్రికెట్ పురోగ‌తి కోసం హెచ్‌సీఏ ఎన్నిక‌ల సంగ్రామంలో బ‌రిలోకి దిగారు. జాతీయ హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తన మార్క్ చూపించిన జగన్ మోహన్ రావు ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ ను ప్రారంభించి ఆ క్రీడకు దేశంలో సరికొత్త గ్లామర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్లేయర్ల ఎంపికలో అక్రమాలు, వివాదాలు, కోర్టు కేసుల‌తో హెచ్‌సీఏ ప‌రువు మ‌స‌క‌బారుతుండ‌డంతో, అసోసియేష‌న్‌ను గాడిన పెట్టేందుకు దేశ క్రీడ రంగంలో ఇప్ప‌టికే త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌న్‌మోహ‌న్ రావును బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌లైన కేటీఆర్, కవిత, హరీశ్ రావునే బ‌రిలోకి దించిన‌ట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

యూనైటెడ్ మెంబ‌ర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ ..

అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడిగా పి.శ్రీధ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆర్‌. హ‌రినారాయ‌ణ, స‌హాయ కార్య‌ద‌ర్శిగా నోయ‌ల్ డేవిడ్ (మాజీ క్రికెట‌ర్‌), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్‌గా అన్స‌ర్ అహ్మ‌ద్ ఖాన్ పోటీ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..