HCU: ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హెచ్‌సీయూ.. ఐదేళ్లలో 9 మంది బలవన్మరణం

|

Aug 25, 2021 | 9:56 AM

చదువులకు కేంద్ర బిందువు కావాల్సిన హెచ్‌సీయూ.. ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. 5 సంవత్సరాల్లో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా..

HCU: ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హెచ్‌సీయూ.. ఐదేళ్లలో 9 మంది బలవన్మరణం
Hcu Student Suicide
Follow us on

చదువులకు కేంద్ర బిందువు కావాల్సిన హెచ్‌సీయూ.. ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. 5 సంవత్సరాల్లో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మౌనిక అనే ఎంటెక్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మౌనిక చనిపోయే ముందు సూసైడ్ నోట్ కూడా రాసింది. నా చావుకు నేనే కారణం.. నేను మంచి కూతురుగా ఉండలేక పోయా. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. లవ్ యూ ఆల్.. మిస్ యూ షణ్ణు.. అంటూ లేఖలో రాసింది. సెమిస్టర్ గ్రేడ్ సర్టిఫికెట్‌లో తన చివరి అక్షరాలను.. వేదన నిండిన మనసుతో లిఖించింది. గదిలో ఫ్యానకు ఉరేసుకుని.. లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

సాధారణంగా హెచ్సీయూ అంటే.. మెరిట్ విద్యార్ధులకు మాత్రమే సీటు వస్తుంది. ఉన్నత విద్యావంతులే.. ఇక్కడ తరగతి గదుల్లో ఉంటారు. కానీ వాళ్లే ఆత్మహత్యలు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్కువ స్ట్రెస్ వల్లే విద్యార్ధులు చనిపోతున్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి. సరైన కౌన్సిలింగులు లేకపోవడం.. డిప్రెసన్ కు కారణం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ విషయంలో ఫ్యాకల్టీ నుంచి ఒత్తిడిలు వస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

24గంటల్లో 18 గంటలు చదువు మీదనే పోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇతర యాక్టివిటీస్ లేకపోవడంతో మానసిక ఒత్తిడులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వింత వింత ప్రవర్తనలు చేయడమే కాకుండా.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు సైకియాట్రిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫ్యాకల్టీ నుంచి ఒత్తిడి కారణంగానే మౌనిక చనిపోయినట్టు తండ్రి ఆరోపిస్తున్నారు.

మౌనిక ఫోన్, ల్యాప్ టాప్ సీజ్ చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటనే దానిపై సైబరాబాద్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలేమైనా ఉన్నాయా అనే కోణంలో రూమ్ మేట్స్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరిని కలిసింది.. ఎవరితో మాట్లాడింది అనే కోణంలో విచారణ జరుగుతోంది.

గతంలో యూనివర్సిటీలో గంజాయి , డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ఈక్రమంలో విద్యార్ధులు మత్తుకు బానిసలవుతున్నారా.. లేక క్యాంపస్‌లో ఇంకేమైనా అనుకోని ఘటనలు జరుగుతున్నాయా.. అనేదానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

Also Read: ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్

 పెళ్లింట ఊహించని విషాదం.. మినీ ట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి