AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ వృద్దుడ్ని చూసి పిచ్చోడు అనుకునేరు.. అతడు బ్యాగులో ఉన్నది తెలిస్తే మైండ్ బ్లాంక్

Old City News: మాసిన గడ్డం, జుట్టు.. చేతిలో బ్యాగు.. అందులో కొన్ని పాత దుస్తులు.. అతడి వాలకం చూస్తే.. ఎవరైనా సరే అభాగ్యుడు.. ఇల్లు, వాకిలి లేనివారు అనుకుంటారు. కానీ అస్సలు యవ్వారం తెలిస్తే మీ బుర్ర గిర్రున తిరుగుతుంది.

Hyderabad: ఈ వృద్దుడ్ని చూసి పిచ్చోడు అనుకునేరు.. అతడు బ్యాగులో ఉన్నది తెలిస్తే మైండ్ బ్లాంక్
Hyderabad Old Man
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2023 | 7:57 PM

Share

మత్తు యువతను నాశనం చేస్తుంది. అద్భతమైన భవిష్యత్‌ను గంజాయికు భానిసలై చిదిమేసుకుంటున్నారు కొందరు యువతీయువకులు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటకీ స్మగర్లు.. అస్సలు వెనక్కి తగ్గడం లేదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను మించిన స్కెచ్చులతో మాల్‌ను గట్టు దాటిస్తున్నారు.  ఈ క్రమంలో పోలీసులకు చిక్కినా.. జైల్లో చిప్ప కూడు తిన్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరో విచిత్రమైన గంజాయి యవ్వారం వెలుగుచూసింది. ఈ ఫోటోలోని వృద్ధుడిని చూడండి. అతడి వాలకం చూస్తే .. పాపం పిచ్చోడు ఏమో.. ఇల్లు, వాకిలి లేని వాడేమో అనుకుంటారు కదా…! ఈ గెటప్ అయితే ఎవరూ పట్టించుకోరు అనుకున్నాడో ఏమో.. ఓ వ్యక్తి.. ఆ వేషం కట్టి గంజాయి అమ్మకం షురూ చేశాడు. పాతబస్తీ మీర్ చౌక్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మీర్ చౌక్‌లో  సిరాజ్​ అనే ఈ వృద్ధుడు.. అందరికీ కనిపించేలానే గంజాయి సేల్ చేస్తున్నాడు. స్టూడెంట్స్, పలువురు యువకులు అతడి వద్ద గంజాయి కొనడాన్ని.. అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే.. ​ సిరాజ్‌ను పట్టుకుని మీర్​చౌక్​ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిటీలో ఇంత బాహాటంగా గంజాయి అమ్మకం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలు కఠినా చట్టాలు తెస్తున్నా… పోలీసులు ఎంత అలెర్ట్‌గా ఉంటున్నా.. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో డ్రగ్స్, గంజాయి రవాణా, వినియోగానికి అడ్డుకట్ట పడటం లేదు. దీనికి ఇంకాస్త బెటర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..