AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలుసా..?

భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయి. ఈ విషయాన్ని ‘మెర్సర్స్‌ 2023 కాస్ట్‌..

Subhash Goud
|

Updated on: Jun 11, 2023 | 8:51 PM

Share
భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయి. ఈ విషయాన్ని  ‘మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే’ వెల్లడించింది.

1 / 6
ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఈ  లిస్ట్  రూపొందించారు.

2 / 6
ఈ లిస్ట్ ప్రకారం.. ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది. దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి.

3 / 6
అలాగే అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్‌, సింగపూర్‌, జూరిచ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో ఈ ఏడాది  83 స్థానాలు కోల్పోయి హవానా నిలిచింది.  పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ కూడా దీని తరువాత ఉన్నాయి.

4 / 6
ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్‌కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి.

5 / 6
అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి ప్రాంతాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి.

6 / 6
Follow Us