హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను పట్టాలెక్కించింది. ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో 16, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 15, హైదరాబాద్- లింగపల్లి రూట్‌లో 12, లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 12 చొప్పున మొత్తం 55 ఎంఎంటీఎస్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడుస్తాయన్న దానిపై క్లారిటీ ఇస్తూ తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజలు మళ్లీ సాధారణ జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం జూన్ 23వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో మార్చి 23న రద్దు చేసిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు 15 నెలల తరువాత మళ్లీ సేవలు అందిస్తున్నాయి.
TIME TABLE FOR #MMTS SERVICES RESUMED FROM 01st JULY, 2021#TwinCities #Hyderabad #Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/IvxysyBs7m
— South Central Railway (@SCRailwayIndia) June 30, 2021
Also Read:
ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..
బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!