Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. హోలీ పండగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్లు..

South Central Railway: హోలీ పండగకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది....

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. హోలీ పండగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్లు..
Summer Holiday Special Trains
Image Credit source: TV9 Telugu

Edited By: Janardhan Veluru

Updated on: Mar 03, 2022 | 3:18 PM

Holi Special Trains: హోలీ పండగకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లను దేశంలోని పలు ప్రాంతాలకు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి గోరక్‌పూర్‌కు ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు వారానికి ఒక్కసారి మొత్తం మూడు వారాలు నడవనుంది.

02575 నంబర్ గల రైలు 11-03-22, 18-03-2022, 25-03-2022 తేదీల్లో హైదరాబాద్ నుంచి గోరక్‌పూర్ వెళ్లనుంది. అలాగే 02576 నంబర్ గల రైలు మార్చి 13,20,27 తేదీల్లో గోరక్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు రానుంది. 02575 నంబర్ గల రైలు సికింద్రాబాద్, ఖాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఖాన్‌పూర్, లక్నో మీదిగా గోరక్‌పూర్‌ వెళ్లనుంది.

ఎర్నాకులం జంక్షన్‌ నుంచి బారౌనీకి కూడా ప్రత్యేక రైలు నడపనున్నారు. 062522 నంబర్ గల రైలు మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 4 తేదీల్లో ఎర్నాకులం జంక్షన్‌ నుంచి బారౌనీకి నడపనున్నారు. అలాగే 062521 నంబర్ గల రైలు మార్చి 8, 15, 22, 29 ఏప్రిల్ 5న బారౌనీ నుంచి ఎర్నాకులం జంక్షన్‌కు రానుంది.

Read Also.. Hyderabad: బైక్ రేసింగ్‌లతో యువకుల హల్‌చల్‌.. భాగ్యనగరంలో 8 మంది అరెస్టు