మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. వనస్థలి పురం నుంచి బంజారాహిల్స్ వరకు.. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని తేడా లేకుండా నగరం మొత్తం కుంటపోత కురిసింది. శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, రామ్‌నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్‌లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన GHMC, DRF, అత్యవసర విభాగాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. పాతబస్తీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై ట్రాఫిగ్ భారీగా నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికెళ్తున్న కొందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా గోల్కొండలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడ ఇవాళ బీజేపీ ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోంది. బతుకమ్మ సంబరాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొనగా.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు మహిళలు.
చినుకు సిటీని వణికిస్తోంది. వర్షం మొదలైందంటే నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరదలు ఎక్కుడ చుట్టుముడతాయో అని భయపడుతున్నారు. కాగా రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: ‘ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు’… సీఎం జగన్ ఆదేశాలు