Hyderabad Rains: బాబోయ్.. మళ్లీ మొదలైన కుండపోత వాన.! హెచ్చరికలు జారీ
మహానగరాన్ని వానలు వదిలేలా కనిపించడం లేదు. బుధవారం కురిసిన వానకే నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంట వ్యవధిలోనే 10 సెం. మీలకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇక గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం నుంచి..

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హైదరాబాద్ మహానగరాన్ని వానలు వదిలేలా కనిపించడం లేదు. బుధవారం కురిసిన వానకే నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంట వ్యవధిలోనే 10 సెం. మీలకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇక గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం నుంచి నగర వ్యప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్నా.. మధ్యాహ్నం ఉంచి సడెన్‌గా భారీ వర్షం కురుస్తుంది.
ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, ఓయూ, తార్నాక, దోమలగూడ, విద్యానగర్, బాగ్‌లింగంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, జూబ్లీహిల్స్, మణికొండ, ఫిల్మ్‌నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఎస్సార్ నగర్, బోరబండ, అల్లాపూర్, చార్మినార్, బహదూర్‌ఫురా, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇవాళ సాయంత్రం మొదలైన వర్షం రాత్రికి సిటీ మొత్తానికి వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ రాత్రి కూడా కుండపోత వర్షం తప్పేలా లేదని జనాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా వెళ్లడం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు బుధవారం కూడా సాయంత్రం 6.30 గంటల నుంచే నగరంలో వర్షం మొదలై అర్ధరాత్రి వరకు నాన్స్టాప్గావాన కురిసింది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. సికింద్రాబాద్‌లో 13 సెం.మీ, శేరిలింగంపల్లిలో 12.6 సెం.మీ, చందానగర్‌లో 11.2 సెం.మీ, లింగంపల్లిలో 10.7 సెం.మీ, జూబ్లీహిల్స్‌లో 8.9 సెం.మీ, ఖైరతాబాద్‌లో 8.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని రోడ్లన్నీ వాన నీటితో మునగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని జనం నానాఇబ్బందులు పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








