డేంజరస్‌గా మారిన భాగ్యనగరం.. ఇక్కడ గాలి పీలిస్తే అంతే..
వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి మన హైదరాబాద్ సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయాన్నే జాగింగ్, మార్నింగ్ వాక్ చేసేవాళ్లకు ఊపిరి పీల్చుకోవడం […]
వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి మన హైదరాబాద్ సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయాన్నే జాగింగ్, మార్నింగ్ వాక్ చేసేవాళ్లకు ఊపిరి పీల్చుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ఇక ఈ చల్లని వాతావరణంలో స్వైన్ ఫ్లూను వ్యాపించే వైరస్, బ్యాక్తీరియాలు ఎన్నో వృద్ధి చెందుతాయని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు, ఆస్తమా పేషెంట్స్‌లకు చాలా ప్రమాదకరమని వారి వాదన.
ఇక హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. నవంబర్ 22కి అది 158గా నమోదైంది. బేగంపేట, బాలానగర్, నెహ్రూ జూలాజికల్ పార్క్, జీడిమెట్ల, ఆబిడ్స్, పంజాగుట్ట వంటి ప్రదేశాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు గాలిలో సల్ఫర్ డయాక్సయిడ్, హైడ్రో కార్బన్స్, అమోనియం కార్బో మోనాక్సయిడ్ వంటి రసాయనాలు పొగ మంచుతో కలిసిపోవడం వల్ల ప్రజలు గాలి పీల్చుకునేటప్పుడు ఇవన్నీ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల.. శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
అందుకే బయటికి వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎక్కువగా గ్రీనరీ ఉండే ప్రదేశాల్లో గడిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.