Hyderabad: కంగారుగా కనిపించిన ఇద్దరు మహిళా ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా, హెల్త్ డ్రింక్‌లో..

|

Jun 18, 2023 | 4:12 PM

Hyderabad Airport: అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతూ పట్టుబడుతూనే ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న స్మగ్లర్లకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు దిమ్మ తిరిగేలా సమాధానం చెబుతున్నారు.

Hyderabad: కంగారుగా కనిపించిన ఇద్దరు మహిళా ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా, హెల్త్ డ్రింక్‌లో..
representative image
Follow us on

Hyderabad Airport: అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతూ పట్టుబడుతూనే ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న స్మగ్లర్లకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు దిమ్మ తిరిగేలా సమాధానం చెబుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఇద్దరూ వేర్వేరు మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి.. 53లక్షల 14వేల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హెల్త్ డ్రింక్ డబ్బాలో ఓ మహిళ బంగారం పౌడర్‌ను తీసుకోని వచ్చిందని.. మరో మహిళ పేస్ట్ రూపంలోనున్న గోల్డ్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. అయితే, వారి ప్రవర్తనపై అనుమానం కలగడంతో.. వారిని ఆపి తనిఖీలు నిర్వహించామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. బంగారం విషయం బయటపడిందన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. అధికారులు అక్రమ బంగారం రవాణాపై విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..