జీహెచ్‌ఎంసీలో మస్కిటో హాట్‌స్పాట్స్ దడ పుట్టిస్తున్నాయి. అసలే వానలు ఆపై కొవిడ్ ఫియర్.. ఈ క్రమంలో దోమల స్వైరవిహారం జనాన్ని భయపెడుతోంది. దోమలు ఎక్కువగా ఉండే హాట్‌స్పాట్లు 34వేలు ఉన్నాయంటే నమ్మగలరా..? అవును నిజమేనని లెక్కగట్టి చెబుతోంది జీహెచ్‌ఎంసీ. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. దోమలు వృద్ది చెందకుండా ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించింది. వేలకొద్ది కన్‌స్ట్రక్షన్ సైట్లు, ఓపెన్ ప్లాట్లు, సెల్లార్లు.. వందలకొద్ది స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లల్లో ఎక్కువగా దోమలు వృద్ది చెందుతున్నట్టు గుర్తించారు. ట్యాంక్‌లు, నీళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన బ్లీచింగ్, కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు.
వంద రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ పూర్తయ్యేలా నడుం బిగించింది జీహెచ్‌ఎంసీ. 360 అతి సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అధికారుల తీరుపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం మామూలేనన్నారు.
అశ్రద్ద చేస్తే.. దోమల దండు విరుచుకుపడడం ఖాయం
నిజానికి గుడ్డు, లార్వా దశలో ఉండగానే వాటిని నిర్మూలించాలి. లేదంటే దోమల దండు విరుచుకుపడడం ఖాయం. కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్ సాధ్యమైనంత త్వరగా పకడ్బందీగా పూర్తి చేయాలంటున్నారు.
Also Read: అస్సాం మహిళపై నెటిజన్లు ప్రశంసలు.. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఏంచేసిందో తెలుసా?