Ganja Smuggling: హైదరాబాద్‌లో పోలీసుల సీక్రెట్‌ ఆపరేషన్‌.. భారీ ఎత్తున గంజాయి పట్టివేత

| Edited By: Subhash Goud

Aug 23, 2023 | 1:45 PM

గోల్కొండ పోలీసులు, నార్కోటిక్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ ల్ గంజాయి విక్రయిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో పదిమంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి గుమ్మి చక్రవర్తి తెలిపారు. అరెస్ట్ అయినా..

Ganja Smuggling: హైదరాబాద్‌లో పోలీసుల సీక్రెట్‌ ఆపరేషన్‌.. భారీ ఎత్తున గంజాయి పట్టివేత
Ganja Smuggling
Follow us on

హైదరాబాద్, ఆగస్టు 23:  గంజాయి రవాణా విక్రయం పై పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్న హైదరాబాద్ నగరంలోకి ఏదో దారిలో గంజాయి వస్తూనే ఉంది. హైదరాబాద్ లోని పాతబస్తీ దూల్పేట్ లాంటి ప్రాంతాల్లో నే కాకుండా నానక్ రామ్ గూడకు సైతం ఈ దందా పాకింది. చాటుమాటుగా కాకుండా కిరాణా దుకాణాల్లోనే ఏకంగా క్యూఆర్ కోడ్ స్కానర్లు పెట్టి మరి డబ్బులు స్వీకరిస్తున్నారు

గోల్కొండ పోలీసులు, నార్కోటిక్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ ల్ గంజాయి విక్రయిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో పదిమంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి గుమ్మి చక్రవర్తి తెలిపారు. అరెస్ట్ అయినా వారిలో ఇద్దరు మహిళలు కాగా.. ఒక జువైనల్ కూడా ఉన్నాడు. ఈ కేసులో గౌతమ్ సింగ్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడు. అతని తల్లి నీతూ భాయి, అత్త మధు భాయి ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. వీరంతా నానక్ రామ్ గుడా లో కిరాణా షాప్ నడుపుతూ అందులోనే గంజాయి అమ్ముతున్నారు.

అయితే 2019 లో గౌతమ్ సింగ్ ఎన్డీపీఎస్ కేసు ఉన్నట్లు పోలీసులు అన్నారు. 2018 నుంచి నీతూ భాయి పై కేసులు ఉన్నాయి ఉండగా, నీతూ భాయి పై 2021 లో పిడి యాక్ట్ నమోదు అయింది. జైలు నుండి వచ్చిన తీరు మార్చుకొని నీతూ భాయిఈ దందా కు కొనసాగించింది. నిందితులు అంతా కూడా కుటుంబ సభ్యులే కాగా నిందితుల వాడిన 16 బ్యాంక్ ఖాతాలలోని 1.53 కోట్ల నగద్ను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన 40.30 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరి వద్ద నుంచి 23.4 కిలోల గంజాయి, గంజాయి తరలింపుకు వినియోగించిన కారు సీజ్ చేసారు..రెండు ద్విచక్ర వాహనాలు, ఫోన్ పే స్కానర్లు,అరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం.

ఇవి కూడా చదవండి

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ నాలుగు కోట్లు ఉంటుందని అంచనా, 4 కోట్ల రూపాయల ఏ కాకుండా ఇంకా విలువ ఉంటుంది అని ఈజీ మనీ కోసం కుటుంబ సభ్యులంత కలిసి గంజాయి విక్రయిస్తున్నారు.దూల్పేట్ నుండి కేజీ 8 వేలకు గంజాయి కొనుగోలు చేస్తున్నా ముఠా
ఐదు గ్రాముల చొప్పున ఒక్కో ప్యాకెట్ రెడీ చేసి ప్యాకెట్ను 250కు ఆమ్ముతున్నారు.

కేజీకి సుమారుగా 50వేల వరకు ఆదాయం పొందుతున్నారు ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో గాంధీ నగర్, లంగర్ హౌస్ లలో G+2 ఇళ్లను 2 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒకరోజుకు సుమారు ముప్పై వేల వరకు నిందితులు సంపాదిస్తున్నారు ముఠా..అయితే ఈ ముఠా నానక్ రామ్ గుడా లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ నుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నారు వారికే ఈ గంజాయి విక్రయిస్తున్నారు అని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి