Hyderabad: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని ఘరానా మోసం.. ఏకంగా రూ.72 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పిన ఓ గ్యాంగ్‌ అమాయక ప్రజల నుంచి ఏకంగా 72 లక్షల రుపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Hyderabad: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని ఘరానా మోసం.. ఏకంగా రూ.72 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
Gold Scam

Edited By:

Updated on: Jun 19, 2025 | 12:42 AM

ఎవరూ ఎవరికి ఉత్తి పుణ్యానికే మంచి చేయరు. మనకు లాభం చేకూరేలా అయితే అస్సలు సహకరించరు. అలా అని అందరూ అలానే ఉంటారని కాదు.. ఎక్కడో కొన్ని చోట్ల మంచివాళ్లు కూడా ఉంటారు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే. తక్కువ ధరకే అది ఇస్తాం.. ఇది ఇస్తాం.. లేదా కొంచెం డబ్బు పెట్టుబడి పెట్టండి, దానికి రెండింతలు సంపాదించుకోవచ్చని మాయమాటలు చెప్పి మోసం చేసేవాళ్లు ఈ మధ్య మరీ ఎక్కువైపోయారు. అలాంటి మోసమే ఇక్కడ కూడా జరిగింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి ఓ గ్యాంగ్‌ డబ్బులు కాజేసింది.

వివరాళ్లోకి వెళితే.. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని అక్షరాల 72 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్‌తో సహా పరారైంది ఓ గ్యాంగ్. వారిని నమ్మిన ఆ అమాయక జనాలు కూడా తక్కువ ధరకే బంగారం సొంతం చేసుకోవచ్చని, బయట ధరలు విపరీతంగా ఉన్నాయని పిచ్చి ఆలోచన చేశారు. ఇంకేముంది ఇదే ఆ ముఠాకి అవకాశంగా మారింది. ఏవేవో మాయమాటలు చెప్పి, తక్కువ ధరలోనే బంగారం ఇప్పిస్తామని వాళ్లను నమ్మించిన ముఠా వారి వద్ద ఉన్న డబ్బుల బ్యాగ్‌తో మాయం చేసింది. వారికి ఎలాంటి అనుమానం రాకుండా, ఒకవేళ పోలీసులు వెతికినా పట్టుబడే అవకాశం ఉండకూడదని ఆ బ్యాగ్‌ను మరో గ్యాంగ్‌కు ఇచ్చి అక్కడి నుంచి పంపేసింది.

ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..