Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janardhana Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

గాలి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు నిలుపుదల చేసింది. అంతేకాకుండా గాలి జనార్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు రూ.10 లక్షల షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

Janardhana Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..
Obulapuram Mining Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 11, 2025 | 11:42 AM

గాలి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు నిలుపుదల చేసింది. అంతేకాకుండా గాలి జనార్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు రూ.10 లక్షల షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. దీంతోపాటు భారతదేశం విడిచి ఎక్కడికీ వెళ్లిపోవడానికి వీలు లేదని.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని గాలి జనార్ధన్‌రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. కాగా.. సీబీఐ కేసు కూడా కొట్టి వేయాలంటూ గాలి జనార్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు సీబీఐ కోర్టు తీర్పుపై సస్పెన్షన్ విధించకపోతే తన నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని గాలి జనార్థన్‌రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు తీర్పు రాగనే జనార్థన్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా అనర్హత పడింది. బళ్లారి నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన హైకోర్టు.. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు 15 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం మార్చి 6 తుది తీర్పు ఇచ్చింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆతర్వాత సుధీర్ఘ విచారణ జరగగా.. సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డితోపాటు బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా ప్రకటిస్తూ.. శిక్షలు ఖరారు చేసింది. వీరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంలను నిర్దోషిలుగా ప్రకటించింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా.. హైకోర్టు శిక్షను నిలుపుదల చేసి.. బెయిల్ మంజూరు చేయడంతో.. గాలి జనార్థన్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత