Baton gang : అర్థరాత్రి వేళ కనిపించిన వారిని కనిపించినట్టు బాదుతున్న లాఠీ గ్యాంగ్‌లో నలుగురు అరెస్ట్

Four arrested in baton gang : వెర్రి వేయి విధాలన్న చందంగా అర్థరాత్రి వేళ ఎవరు కనిపిస్తారా.. లాఠీలకు పని చెబుదామా.. ! అని కాపు కాచి, కనిపించిన వాళ్లని కనిపించినట్టు..

Baton gang  : అర్థరాత్రి వేళ కనిపించిన వారిని కనిపించినట్టు బాదుతున్న లాఠీ గ్యాంగ్‌లో నలుగురు అరెస్ట్
Baton Gang

Updated on: May 27, 2021 | 9:56 PM

Four arrested in baton gang : వెర్రి వేయి విధాలన్న చందంగా అర్థరాత్రి వేళ ఎవరు కనిపిస్తారా.. లాఠీలకు పని చెబుదామా.. ! అని కాపు కాచి, కనిపించిన వాళ్లని కనిపించినట్టు లాఠీలతో ఇరగ్గొడుతోన్న లాఠీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గ్యాంగ్లో నలుగుర్ని ఈ సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొంతకాలంగా బాలాపూర్ షాహీన్‌నగర్ లో అర్ధరాత్రి లాఠీలతో విరుచుకుపడుతోంది ఒక గ్యాంగ్. అర్థరాత్రి వేళ రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించినట్టు లాఠీలతో బాదుతోందీ ముఠా. ఇటీవల ముఠా ఆగడాలు మరీ పెచ్చుమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు బాలాపూర్ బిస్మిల్లా కాలనీ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వికృత చేష్టలకు పాల్పడుతోన్న వాళ్లని ఇమ్రాన్, ఇమ్రాన్ మహ్మద్, షేక్ జిలాని, సయ్యద్ సమీర్ గా గుర్తించి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.

Read also : Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్