Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత.. పోలీసుల అదుపులో ప్రయాణికుడు
Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి రోజు ఏదో విధంగా అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్ ఇలా పట్టుబడిపోతున్నాయి.
Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి రోజు ఏదో విధంగా అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్ ఇలా పట్టుబడిపోతున్నాయి. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతున్నారు అధికారులు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
లగేజీ బ్యాగులో కరెన్సీ దాచి తరలించే ప్రయత్నం చేస్తుండగా, స్కానింగ్‌లో బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
కాగా, రోజురోజుకు అక్రమ రవాణాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమంగా బంగారం, కరెన్సీ ఇలా గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి విదేశాలకు అక్రమ రవాణాలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. కొందరైతే అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిపోతున్నారు. అలా అక్రమ కరెన్సీని తీసుకెళ్తూ పట్టుబడిపోతున్నారు. నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరికి పోలీసులకు చిక్కపోతూ కటకటాల పాలవుతున్నారు. కాగా, తాజాగా పట్టుబడిన కరెన్సీని స్వాధీనం చేసుకుని సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు.. ఇంత కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
ఇవీ చదవండి:
US President Joe Biden: అమెరికాలో పెట్రోల్, డీజిల్ కార్లకు మంగళం.. డెడ్‌లైన్ ఇచ్చేసిన జో బైడెన్