మరోసారి తెలంగాణలో పడగ విప్పుతున్న కరోనా వైరస్.. విద్యాసంస్థలను వదలని మహమ్మారి

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజ‌ృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి.

మరోసారి తెలంగాణలో పడగ విప్పుతున్న కరోనా వైరస్.. విద్యాసంస్థలను వదలని మహమ్మారి
Follow us

|

Updated on: Mar 23, 2021 | 3:18 PM

Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజ‌ృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం కోవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

Telangana Coronavirus Cases

Telangana Coronavirus Cases

అటుె దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 715 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కు చేరింది. గడిచిన 24 గంటల్లో 199 మంది కరోనాతో ప్రాణాలను కోల్పోయారు. దేశంలో కరోనా వెలుగుచూసిన తర్వాత ఇప్పటివరకు లక్షా 60వేల 166మంది కోవిడ్ తో మరణించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కోరలుచాస్తోంది. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిందని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఒకటీ, రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించవచ్చనే అధికార వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలోని స్కూల్స్‌, గురుకులాల్లో కరోనా కేసులు నమోదవ్వడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. చాలా వరకు లక్షణాలు లేని వారికి కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

Read Also… ఏపీలో వెలుగు చూసిన కొత్త రకం సైబర్ మోసం.. నమ్మినందుకు నట్టేట ముంచాడు.. కూపీలాగుతున్న పోలీసులు

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..