రెండో రోజు కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏటా మృగశిరకార్తెలో ఉబ్బసం, ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేపమందును ఉచితంగా ఇచ్చే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శనివారం సాయంత్రం నుంచి చేపమందును రోగులకు ఇస్తున్నారు. ఇక ఈ రోజు చివరి రోజు కావడం.. అందులో ఆదివారం సెలవు కలిసి రావడంతో రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు […]

రెండో రోజు కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jun 09, 2019 | 9:01 AM

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏటా మృగశిరకార్తెలో ఉబ్బసం, ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేపమందును ఉచితంగా ఇచ్చే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శనివారం సాయంత్రం నుంచి చేపమందును రోగులకు ఇస్తున్నారు. ఇక ఈ రోజు చివరి రోజు కావడం.. అందులో ఆదివారం సెలవు కలిసి రావడంతో రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అయితే చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లక్షా 60 వేల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. వీటిలో కొన్నింటిని శనివారం అందజేశారు. అయితే ఇక్కడ చేప ప్రసాదం తీసుకోలేకపోయిన వారి కోసం గతంలో ఇంటి దగ్గర కూడా బత్తిని సోదరులు చేపప్రసాదాన్ని అందజేసేవారు. అయితే ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదంున్నారు బత్తిని సోదరులు. గంట ఆలస్యమైనా క్యూలైన్లలో ఉన్న వారందరికీ చేప ప్రసాదం అందజేస్తామని తెలిపారు.

కాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చేప ప్రసాదం తీసుకునేందుకు నాంపల్లి గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం, 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అందుబాటులో 6 వైద్య బృందాలు, 3 అగ్ని మాపక వాహనాలను, 3 బెల్లెట్ వాహనాలు, ఫైర్ కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని 14 ట్రాఫిక్ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి వంద మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ద్య నిర్వహణకు వెయ్యిమందికి పైగా సిబ్బందిని కేటాయించారు. రోగులు, సహాయకుల కోసం ఐదు రూపాయల భోజన కౌంటర్లు ఏర్పాటు చేశారు.