AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Fire Accident: చార్మినార్‌ సమీపంలో అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ కీలక ప్రకటన!

Hyderabad Fire Accident: ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఏడాదిన్నర చిన్నారి, ఏడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల పిల్లలు ఆరుగురు ఉన్నారు. అలాగే మృతుల్లో నలుగురు 60 ఏళ్లపైబడిన వారు ఉండగా, ఐదు..

Hyderabad Fire Accident: చార్మినార్‌ సమీపంలో అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ కీలక ప్రకటన!
Subhash Goud
|

Updated on: May 18, 2025 | 1:47 PM

Share

చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది అగ్ని మాపక శాఖ. ఉదయం 6 గంటల 16 నిమిషాలకు గుల్జార్ హౌస్ చౌరస్తాలో G ప్లస్ 2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం వచ్చిందని, మొఘల్‌పురా ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారని తెలిపింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయని తెలిపింది అగ్ని మాపక శాఖ. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని తమ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించింది.

ప్రాణాలు తెగించి రెస్క్యూ ఆపరేషన్

ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా.. మంటలకు శరీర భాగాలు కాలిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రమాదం జరుగగానే వెంటనే స్పందించామని అగ్నిమాపక శాఖ తెలిపింది.

అగ్ని ప్రమాదఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి:

ఈ అగ్ని ప్రమాదఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలయ్యారని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. అగ్నిమాపకశాఖపై సమీక్ష నిర్వహించాలని అన్నారు.

17 మంది మృతి

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఏడాదిన్నర చిన్నారి, ఏడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల పిల్లలు ఆరుగురు ఉన్నారు. అలాగే మృతుల్లో నలుగురు 60 ఏళ్లపైబడిన వారు ఉండగా, ఐదుగురు 30 నుంచి 40 ఏళ్లలోపువారు ఉన్నారు. 17 మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

ఇది కూడా చదవండి: Fire Accident: గాఢనిద్రలో ఉండగా మంటలు.. చార్మినార్‌ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్