Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం.. బ్యాంక్‌లో చెలరేగిన మంటలు..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎస్బీఐలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేటుకు ఆనుకొని ఉన్న ఎస్బీఐలో..

Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం.. బ్యాంక్‌లో చెలరేగిన మంటలు..
Fire Accident

Updated on: Aug 26, 2021 | 10:25 PM

Fire Accident: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎస్బీఐలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేటుకు ఆనుకొని ఉన్న ఎస్బీఐలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. అయితే బ్యాంక్ సమయం అయిపోవడంతో బ్యాంకు మూసివేశారు అధికారు. దాంతో కిటికీలో బయటకొచ్చిన పొగలు బయటకు వచ్చాయి.  అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే బేగంబజార్ పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. బ్యాంకు కిటికీలను, షటర్లను పగలగొట్టి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో బ్యాంక్ లోని ఫర్నిచర్ సోఫాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే  స్ట్రాంగ్ రూంకు ముప్పు వాటిల్ల లేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు.  పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విడిసిల అరాచకం.. కూలీ పెంచమన్నందుకు 70 దళిత కుటుంబాల బహిష్కరణ..

Dalitha Bandhu: దేశానికే ఆదర్శం దళితబంధు పథకం.. లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రులు..

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారుల ఓవరాక్షన్.. పీఠల మీది పెళ్లిని ఆపి మరీ..