Telangana: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?

రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా చందానగర్ ప్రాంతంలోని ఇరుకైన గల్లీలో ఒక్కసారిగా టపాసాలు పేలుతు పెద్ద శబ్దాలు వినిపించాయి స్థానికులందరూ భయాందోళనకు గురై పరుగులు పెట్టారు

Telangana: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?
Fire Accident At Old City
Follow us

|

Updated on: Oct 29, 2024 | 7:44 AM

హైదరాబాద్ పాతబస్తీలో ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్ బ్లాస్ట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగేసిపడ్డాయి. మంటల్ని అదుపులోకి తెచ్చెందుకు ఫైర్ అధికారులు ప్రయత్నస్తున్నారు.  మంటలు చూసి పాతబస్తీ వాసులు భయ ప్రాంతాలకు గురైయ్యారు. సమాచారం అందుకున్న రైన్ బజార్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటి లోపల చిక్కున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. ఏగేసి పడుతున్న మంటల్లో అతి కష్టం మీద ఇంట్లో ఉన్న ముగ్గురిని బయటకి తీసి ఆంబులెన్స్‌లో వేసుకొని ఉస్మానియాకి తరలించగా వైద్యుల పరీక్షలు అనంతరం మోహన్ లాల్, ఉషారాణి దంపతులు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు

మరోవైపు మృతుడికి వరసకు మనవరాలు అయిన శృతి గుప్తా అనే యువతి తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉండటంతో ఉస్మానియా నుంచి మలక్ పేట్ యశోద హాస్పిటల్ కి తరలించారు ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.ఈ ఘటనపై రైన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..