Adivi Sesh: ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..

Adivi Sesh: ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Oct 30, 2024 | 9:38 AM

అడివి శేష్‌! మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్! డైరెక్టర్‌.. రైటర్‌.. అంతకు మించిన మంచి పెర్ఫార్మర్‌. అలాంటి ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మరో బాధ్యతను తన నెత్తి మీద వేసుకున్నాడు. ఎంటర్‌టైన్మెంట్‌ కోసం.. ఆత్రంగా వేచి చూసేవారికి.. సరికొత్త వినోదాన్ని పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. యాడ్ ఫ్రీ.., 4k అల్ట్రా హెచ్‌డీ , డాల్బీ ఫార్మాట్‌లో.. తెలుగు, తమిళ్‌ కంటెంట్‌ను మనకు చూపించబోతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే.. మనకు సజెస్ట్ చేయబోతున్నాడు.

ఎస్ ! ఇప్పటి వరకు 100 పర్సెంట్ తెలుగు కంటెంట్‌ అంటూ.. మనల్ని ఎంటర్‌టైన్ చేసిన ఆహా.. ఎప్పటి నుంచో మరింత ఫైనెస్ట్ క్వాలిటీతో… ఆహా గోల్డ్‌ పేరుతో .. ఫైనెస్ట్ కంటెంట్‌ అందిస్తోంది. తెలుగు, తమిళ్ బాషలకు సంబంధించిన సినిమాలను.. సిరీస్‌లను.. షోలను… 4k, డాల్బీ క్వాలిటీలో స్ట్రీమింగ్ చేస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రతీ ఒక్కరి దగ్గరికీ చేరుస్తోంది. అయితే ఈ ప్లాట్‌ ఫామ్‌కే ఇప్పుడు అడివి శేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇక ఇదే విషయాన్ని ఆహా గోల్డ్‌ టీం.. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అనౌన్స్ చేసింది. ఆహా గోల్డ్‌కు ఇక నుంచి డైనమిక్ హీరో అడివి శేష్ అంబాసిడర్ అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది.

ఇక తాను ఆహా గోల్డ్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడంపై శేష్‌ రియాక్టయ్యారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నా అన్నాడు. ఆహా OTT ప్లాట్‌ఫారమ్.. ఫిల్మ్ లవర్స్‌కు అద్భుతమైన కంటెంట్‌ నివ్వడమే కాదు.. టాలీవుడ్‌కు చేరువ చేసే మరపురాని అనుభవాలను కూడా అందిస్తుందన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.