TOP 9 ET: 'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు.. జక్కన్న రూ.1000 కోట్లు.?

TOP 9 ET: ‘సర్కార్‌’ లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు.. జక్కన్న రూ.1000 కోట్లు.?

Anil kumar poka

|

Updated on: Oct 30, 2024 | 8:24 AM

ఎప్పుడైతే.. టాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్‌ పాన్ ఇండియా సినిమాగా మారిందో.. అప్పటి నుంచే టాలీవుడ్ సినిమాల బడ్జెట్‌ కొండెక్కడం ఆరంభమైంది. భారీ బడ్జెట్ లేనిదే.. స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కడం అసాధ్యం అవుతోంది. ఇక ఈక్రమంలోనే గురూజీ.. అల్లు అర్జున్‌తో తాను తెరకెక్కించబోయే పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా కోసం రూ.500 కోట్లను ఖర్చు పెట్టేందుకు ప్లాన్ చేస్తుండగా... మరో వైపు జక్కన్న ssmb29 సినిమా కోసం ఏకంగా వెయ్యి కోట్లను బడ్జెట్‌ గా పెట్టుకున్నాడని టాక్.

01.Balayya: ‘సర్కార్‌’ లీకైన బాలయ్య సినిమా టైటిల్

సర్కార్.. సర్కార్ సీతారామ్‌! ఇప్పుడు ఈ టైటిలే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నందమూరి అభిమానుల గొంతులో వినిపిస్తోంది. ఎస్ ! బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో NBK 109 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌.. సర్కార్ సీతారామ్ అని ఓ లీక్ బయటికి వచ్చింది. రేపో మాపో అఫీషియల్‌గా రిలీజ్‌ అయ్యే టైటిల్ ఇదేననే టాక్ ఫిల్మ్ నగర్లో కూడా కాస్త గట్టిగా వినిపిస్తోంది.

02.Chandu: చరణ్‌, వెంకటేష్‌ వల్ల.. తండేల్ ఆలస్యం కావొచ్చు.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ తండేల్‌. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యం కావచ్చనే కామెంట్ నేరుగా డైరెక్టర్ నోటి నుంచే బయటికి వచ్చింది. రీసెంట్గా ఓ ఈవెంట్కు వెళ్లిన డైరెక్టర్ చందు.. తండేల్ మూవీ షూటింగ్ ఇంకో పది రోజుల్లో కంప్లీట్ అవుతుందని సంక్రాంతికి తమ మూవీ రెడీగా ఉంటుందని చెప్పారు. కానీ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ వల్ల కానీ.. వెంకీ అనిల్ రావిపూడి సినిమా వల్ల కానీ.. తమ సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని.. డెసీషన్ ప్రొడ్యూసర్ తీసుకుంటారని చెప్పారు.

03.Rajamouli: కెన్యా అడవుల్లో రాజమౌళి మహేష్ సినిమా కోసం అదిరిపోయే లొకేషన్స్.

జక్కన్న.. మహేష్‌తో .. ఓ భారీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా లొకేషన్స్‌ కోసమే.. కెన్యా అడవుల్లో తిరుగుతున్నారు. కెన్యా అడవుల్లో సఫారీలో తిరుగుతూ.. మహేష్ సినిమా లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

04.maheshL కృష్ణుడిగా మహేష్ బాబు.. ఇదిగో క్లారిటీ.!

గల్లా అశోక్‌ హీరోగా.. అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా దేవకీ నందన వాసు దేవ. నవంబర్ 14న రిలీజ్‌ అవుతన్న ఈ సినిమా నుంచి ఓ బిగ్ న్యూస్ రెండు రోజుల క్రితం బయటికి వచ్చింది. ఈ సినిమాలో కృష్ణుడిగా మహేష్ క్యామియో ఇయ్యనున్నాడనే న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ న్యూస్‌ పై తాజాగా ఈ మూవీ టీం రియాక్టైంది. మహేష్ తమ మూవీలో కృష్ణుడిగా కనిపించడం లేదని చెప్పింది.

05.anil: హిట్టు కొట్టాడు.. రూ.కోట్ల విలువైన కార్‌ను గిఫ్ట్‌గా పట్టాడు.!

రీసెంట్ డేస్లో హిట్టు కొట్టు.. కార్‌ ను గిఫ్ట్గా పట్టు! అనే ట్రెండ్ టాలీవుడ్లో ఎక్కువగా నడుస్తోంది. ఇక ఈ ట్రెండ్‌ను పట్టుకున్నాడో ఏమో తెలీదు కానీ.. భగవంత్‌ కేసరి మూవీ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా తన మూవీ డైరెక్టర్‌ అనిల్ రావిపూడికి బ్రాండ్‌ న్యూ టయోటా.. లగ్జరీ కార్‌ను గిఫ్ట్‌ గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో అప్లోడ్‌ చేశారు. ఇక ఈ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు వీరిద్దరూ.

06.guruji: గురూజీ రూ.500 కోట్లు.. జక్కన్న రూ.1000 కోట్లు.?

ఎప్పుడైతే.. టాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్‌ పాన్ ఇండియా సినిమాగా మారిందో.. అప్పటి నుంచే టాలీవుడ్ సినిమాల బడ్జెట్‌ కొండెక్కడం ఆరంభమైంది. భారీ బడ్జెట్ లేనిదే.. స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కడం అసాధ్యం అవుతోంది. ఇక ఈక్రమంలోనే గురూజీ.. అల్లు అర్జున్‌తో తాను తెరకెక్కించబోయే పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా కోసం రూ.500 కోట్లను ఖర్చు పెట్టేందుకు ప్లాన్ చేస్తుండగా… మరో వైపు జక్కన్న ssmb29 సినిమా కోసం ఏకంగా వెయ్యి కోట్లను బడ్జెట్‌ గా పెట్టుకున్నాడని టాక్.

07.sakhi: 24 ఏళ్ల తర్వాత కలిసిన హీరో, హీరోయిన్

హీరో మాధవన్ , హీరోయిన్ షాలిని! సఖి సినిమాతో ఎవర్‌ గ్రీన్ కపుల్‌గా.. ట్యాగ్ వచ్చేలా చేసుకున్న వీరిద్దరూ.. దాదాపు 24 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. తన భర్త స్టార్ హీరో అజిత్‌లా కాకుండా.. రీసెంట్‌ డేస్లో.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్న షాలిని.. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. మాధవన్‌ను కలుసుకున్న ఫోటోలను షేర్ చేశారు. అలా మరోసారి వీరిద్దరూ సఖి సినిమాను గుర్తు చేస్తున్నారు.

08.naga vamshi: వెంకీకి ఎప్పటి నుంచో పూజా హెగ్డే పై కన్ను ఉంది!

అన్ స్టాపబల్‌ సీజన్‌ 4ను మొదలెట్టి.. సెలబ్రిటీల సీక్రెట్స్ ను ఫన్నీగా బయటపెట్టే ప్రయత్నాన్ని కాస్త గట్టిగా చేస్తున్న బాలయ్య ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగ్ వంశీ నుంచి కూడా ఓ విషయాన్ని రాబట్టారు. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి పూజా హెగ్డేపై కన్ను ఉందంటూ.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు ఆన్సర్‌గా చెప్పేశారు. అయితే ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్‌ అయింది. అలా రిలీజ్‌ అయిన ప్రోమోలో.. ఈ పాయింట్ .. సెపరేట్‌గా ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

09.shilpa: రూ.80 లక్షల కొత్త కారును ఎత్తుకెళ్లారు

పాపం! 80 లక్షల కార్ చోరీ అయింది. అయితే ఇది ఎక్కడో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శిల్పా షెట్టి రెస్టారెంట్లో. ఇక అసలు విషయం ఏంటంటే..! ఓ వ్యక్తి తన 80 లక్షల బ్రాండ్‌ న్యూ లగ్జరీ bmw కార్‌లో.. ముంబైలోని దాదర్ వెస్ట్, కోహినూర్‌ స్క్వేర్‌లోని 48వ ఫ్లోర్‌లో ఉన్న శిల్పా షెట్టి.. బాస్టియన్ ఎట్‌ ది టాప్‌ రెస్టారెంట్‌కు వచ్చాడు. వాలెట్ పార్కింగ్ ఉండడంతో.. తన కార్‌ను పార్క్‌ చేయమని రెస్టారెంట్ సిబ్బందికి ఇచ్చాడు. కానీ తను బోజనం చేసిన తర్వాత కార్ తీసుకురమ్మని రెస్టారెంట్ సిబ్బందికి చెప్పగా కార్ మిస్సైందని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ కార్‌ను పోలీసుల సాయంతో.. వెతికే పనిలో ఉందట శిల్ఫా శెట్టి టీం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 30, 2024 08:11 AM