తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??
తెలంగాణాలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని దీని ప్రభావంతో రాత్రివేళ ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.
పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ ఏడాది చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే మంచు కురుస్తోంది. ఉదయం పూట మంచు కారణంగా రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. కానీ రాత్రిళ్లు మాత్రం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇలా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది చలి తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు వాయువ్య, మధ్య, ఈశాన్య భారతాన్ని రుతు పవనాలు నిర్దిష్ట సమయం కంటే ఒక వారం ఆలస్యంగా వీడి వెళ్లాయి. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను దాటి పవనాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో రాష్ట్రంలో చలి తీవ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండేళ్ల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంటోంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకుపోవడంతో పాటు, రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయనీ కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??
ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

