ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హాపూర్ జిల్లాలోని సదర్‌పూర్ గ్రామంలో ఓ మిస్టరీ పాము భయం పట్టుకుంది. ఈ పాము గత ఐదు రోజుల్లో ఐదుగురిని కాటేసింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చీకటి పడితే చాలు ఈ పాము దాడి చేసి అదృశ్యమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
పాము శబ్ధం వింటేనే ఆ గ్రామం ఉలిక్కిపడుతోంది. హాపూర్‌లోని సదర్‌పూర్ గ్రామంలో పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇది పాము ప్రతీకారంగానే భావిస్తున్నారు. వారిలో కొడుకు, కూతురు, తల్లి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురూ చనిపోయారు. ఆ తర్వాత పాము మరో ఇద్దరిని బలితీసుకుంది. ఈ పామును ఇప్పుడు అటవీ శాఖ బృందం పట్టుకుంది. అయితే గ్రామంలో విషసర్పాలు ఉండటంతో అందరూ భయంతో వణికిపోతున్నారు. సాయంత్రం కాగానే పాము.. గుంతలోంచి బయటకు వచ్చి గ్రామస్తులను బలి తీసుకుంటోందని చెబుతున్నారు. పాము భయంతో సదర్‌పూర్ గ్రామ ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

