ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!

ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!

Phani CH

|

Updated on: Oct 29, 2024 | 9:21 PM

డిజిటల్ చెల్లింపుల విధానంలో భారత్ దూసుకుపోతోంది. యూపీఐ చెల్లింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మనం యూపీఐ పేమెంట్లు ఫోన్‌లో చేస్తుంటే చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ‘అరచేతి స్కానింగ్’తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. ఈ పద్ధతికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ తెగ వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ ఈ వీడియోను షేర్ చేశాడు.

అతను, అతడి స్నేహితులు కలిసి ఈ చెల్లింపుల విధానంపై షార్ట్ వీడియోను రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందో క్లుప్తంగా వివరించారు. చైనాలోని జుజౌ సిటీలోని ఓ కిరాణా దుకాణంలోకి వెళ్లి ఈ విధానంలో చెల్లింపులు ఎలా చెయ్యాలో వివరించారు. ఈ అధునాతన చెల్లింపుల విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అరచేతితో పేమెంట్‌ ఎంత సులభంగా ఉంటుందో కూడా వీడియోలో వివరించారు. స్కానర్‌పై అరచేతిని ఉంచిన రెండు మూడు సెకన్లలోనే పేమెంట్ పూర్తయిందని క్యాషియర్ తెలిపాడు. ఇదంతా చూసి పాకిస్థానీ కంటెంట్ క్రియేటర్ ఆశ్చర్యపోయాడు. చాలా త్వరగా, ఎలాంటి అవాంతరం లేకుండా పేమెంట్ జరగడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘చైనా 2050లో నివసిస్తోంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. కాగా ఈ అరచేతి చెల్లింపు విధానానికి సంబంధించి కొన్ని నెలల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వీడియోను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియో క్లిప్‌లో చైనాలో ఒక మెట్రో స్టేషన్‌లో యంత్రం వద్ద ఒక మహిళ తన అరచేతిని స్కాన్ చేసి టికెట్ డబ్బులు చెల్లించడం కనిపించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??

అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??

ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!

మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి