హైదరాబాద్, జులై 29: సమాజంలో కన్నింగ్ గాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల మోసాలు చూసి ఉంటారు.. విని ఉంటారు. కానీ ఇదో నయా రకం చీటింగ్ కేసు. జస్ట్ మాటలు చెప్పి మరి ముంచేశాడు. రూల్స్, రెగులేషన్స్ పక్కాగా ఫాలో అయ్యే హైకోర్టు జడ్జిగా చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు (రాచకొండ) మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు.. వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి.. ఈజీ మనికి బాగా అలవాటు పడ్డాడు. గతంలో ఇండ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేశాడు. దీంతో నరేందర్ ను అరెస్టు చేసిన పోలీసీలు.. 2017లోనే పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కూడా నరేందర్ అదే మోసాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ప్రణాళికతో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని గన్ మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత ఒక నకిలీ వెబ్ సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు హైకోర్టు జడ్జిగా చెబుతూ మోసం చేస్తున్నాడు నరేందర్.
ల్యాండ్ సమస్యలు ఏమైనా ఉన్నా తాను పరిష్కరిస్తానంటూ నకిలీ వెబ్ సైట్ ద్వారా అమాయక ప్రజలకు ఎరవేసి, మోసాలకు పాల్పడుతున్నాడు. ల్యాండ్ వివాదాలు పరిష్కరిస్తానంటూ కొంతకాలంగా ఫేక్ జడ్జిగా చలామణి అవుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చలామణి అవుతూ తిరుగుతున్న నరేందర్ ను ఇటీవల ఖమ్మంలో అరెస్ట్ చేశారు పోలీసులు. జైలు నుండి బయటకు వచ్చాక నరేందర్ హైదరాబాద్ కు మకాం మార్చాడు.
ఇక హైదరాబాద్ లో కొత్త దందా మొదలుపెట్టిన నరేందర్ అడిషనల్ సివిల్ జడ్జిగా చలామణి అవుతూ మహబూబాబాద్ జిల్లాకు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూల్ చేశాడు నరేందర్. తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఇలా నరేందర్ కొత్త గుట్టు మళ్లీ బయటపడింది.
అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నరేందర్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటకు తెలిసింది. అతడు నకిలీ జడ్జిగా చెలమణి అవుతున్నట్లు గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేసి కటకటల వెనుకకు పంపించారు. నరేందర్ కు గన్ మెన్ గా ఉన్న మధుసూదన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఒక వెపన్, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, క్యాష్, నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ దందాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
The #Sleuths of #SOT_MalkajgiriZone along with @uppalps_ nabbed 02 persons who are cheating innocent public in the name of #AssistantDistrictJudge along with gun-man & recovered a pistol, 05 live rounds, 4-wheeler vehicle & other incriminating articles from their possession. pic.twitter.com/dr0gGD6GAl
— Rachakonda Police (@RachakondaCop) July 28, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..