డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. ఫేక్ ముఠా అరెస్ట్..
Fake Gang Arrested: ప్రభుత్వ పధకాలే పెట్టుబడిగా .. ప్రజలు ఆశలే రాబడిగా.. ప్రభుత్వ అధికారులమంటూ నిండా ముంచుతున్న ఓ గ్యాంగ్‌ను తాజాగా..

Fake Gang Arrested: ప్రభుత్వ పధకాలే పెట్టుబడిగా .. ప్రజలు ఆశలే రాబడిగా.. ప్రభుత్వ అధికారులమంటూ నిండా ముంచుతున్న ఓ గ్యాంగ్‌ను తాజాగా నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా సీఎంవో అధికారులమని చెబుతూ ఓ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతోంది. ఈ కేటుగాళ్లు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ జనాలకు టోపీ పెట్టారు. విలువైన ప్రభుత్వ భూములను అతి తక్కువ డబ్బులకే ఇప్పిస్తామంటూ ప్రజలను బోల్తా కొట్టించారు. కోట్లాది రూపాయలను వసూలు చేశారు. ఇక తాజాగా ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ”ముగ్గురు నకిలీ సీఎం ఓఎస్డిలను అరెస్ట్ చేశాం. గ్యాంగ్ లీడర్ సుధాకర్‌ని అదుపులోకి తీసుకున్నాం. ఈ ముఠా సీఎంవో ఓఎస్డి ఫేక్ ఐడీ కార్డుతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 100 మందిని మోసం చేశారు. ఫేక్ పోలీస్ కార్డ్, ఫేక్ ఓటర్ కార్డ్, ఫేక్ సెక్రటేరియట్ ఎంట్రీ కార్డ్‌లతో మోసాలకు పాల్పడ్డారు” అని పేర్కొన్నారు. కాగా, అఫీషియల్ లెటర్ చూపిస్తేనే రబ్బర్ స్టాంప్‌లు ఇవ్వాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని రబ్బర్ స్టాంప్ తయారీదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిందితులపై మూడు కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేశామన్నారు.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!
