Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. 26 ప్రత్యేక రైళ్ల సేవలు మరో నెల పాటు పొడగింపు.. పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే 26 ప్రత్యేక రైళ్ల సేవలను ఆగస్ట్ 30 వరకు పొడిగించింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే 26 ప్రత్యేక రైళ్ల సేవలను ఆగస్ట్ 30 వరకు పొడిగించింది. తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండడంతో.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల సేవలను వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
చర్లపల్లి-తిరుపతి 07017 నెంబర్ గల ప్రత్యేక రైళు శుక్ర, ఆదివారల్లో, 07018 గల రైలు సోమ, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఇవి కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక 07251/07252 గల రెండు ట్రైన్‌లు బుధ, గురువారాల్లో కాజీపేట, వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ రెండు రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
చర్లపల్లి నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ట్రైన్స్ వివరాలు..
07017 స్పెషల్ ట్రైన్ (చర్లపల్లి-తిరుపతి)
ఈ ప్రత్యేక రైలు ఆగస్ట్ 01-08-25 నుంచి 29-08-25 వరకు ప్రతి శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.
07018 స్పెషల్ ట్రైన్ (తిరుపతి-చర్లపల్లి)
ఈ ప్రత్యేక రైలు 02-08-25 నుంచి 30-08-25 తేదీ వరకు ప్రతి సోమ, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది.
07251 స్పెషల్ ట్రైన్ (చర్లపల్లి నుంచి తిరుపతి)
ఈ ప్రత్యేక రైలు 06-08-25 నుంచి 27-08-25 తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
07252 స్పెషల్ ట్రైన్ (తిరుపతి నుంచి చర్లపల్లి)
ఈ ప్రత్యేక రైలు 07-08-25 నుంచి 28-08-25 వ తేదీ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.
గమనిక: మీకు ఏవైనా సందేహాలు ఉంటే పూర్తి వివరాల కోసం రైల్వే శాఖ అధికారులను సంప్రదించండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
