Telangana: ఇవి మామూలు మూటలు కాదు.. అక్షరాల రూ.50 కోట్లు.. చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గంజాయి.. డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ సర్కార్‌. ఎక్కడికక్కడ మాదకద్రవ్యాల సరఫరాకు చెక్‌ పెడుతోంది. పెడ్లర్లు.. కన్జూమర్ల తాట తీస్తున్నారు పోలీసులు. సప్లై నెట్‌వర్క్‌నే కాదు.. ఏకంగా మూలాల నుంచి చేధిస్తున్నాయి స్పెషల్‌ టీమ్స్‌.

Telangana: ఇవి మామూలు మూటలు కాదు.. అక్షరాల రూ.50 కోట్లు.. చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Drugs
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 11, 2024 | 4:19 PM

గంజాయి.. డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ సర్కార్‌. ఎక్కడికక్కడ మాదకద్రవ్యాల సరఫరాకు చెక్‌ పెడుతోంది. పెడ్లర్లు.. కన్జూమర్ల తాట తీస్తున్నారు పోలీసులు. సప్లై నెట్‌వర్క్‌నే కాదు.. ఏకంగా మూలాల నుంచి చేధిస్తున్నాయి స్పెషల్‌ టీమ్స్‌. తెలంగాణ వ్యాప్తంగా గత నెల రోజుల్లో పట్టుబడ్డ 50 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను దహనం చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఒక్క హైదరాబాద్‌లోనే 20 కోట్ల రూపాయల విలువైన గంజాయి, డ్రగ్స్‌ను డిస్పోజల్‌ చేశారు పోలీసులు.

డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌ గా తెలంగాణను మార్చేందుకు పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి.. డ్రగ్స్‌ నెట్వర్క్‌లను చేధిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న పెడ్లర్ల తాట తీస్తున్నారు. ముఖ్యంగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒరిస్సా బార్డర్‌ నుంచే నజర్‌ పెట్టి… సిటీలోకి గంజాయి ఎంటర్‌ అవకుండా నిర్మూలిస్తున్నారు పోలీసులు.

ఖమ్మం జిల్లా భద్రాచలంలో పట్టుబడ్డ 3 కోట్ల రూపాయి విలువైన 1186 కిలోల గంజాయిని దహనం చేశారు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏడబ్ల్యుఎం కన్సటింగ్‌ లిమిటెడ్‌ దహన కేంద్రంలో డిస్పోజల్‌ చేశారు పోలీసులు.

కేవలం గత నెలలోనే తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలో ఏకంగా 11 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 703 కేసుల్లో 7,951 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌ నుంచి గంజాయి తోపాటు… బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున్న స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు.

వీడియో చూడండి..

గతనెల అదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గత నెల మోత్తంగా 48 కేసుల్లో 412 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ కోటిన్నర వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఇక మెదక్‌ జిల్లాలోనూ గత నెలలో 26 కేసుల్లో 107 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ 88 లక్షల వరకు ఉంటుందని అంచనా. నల్గొండ జిల్లాలో కేవలం ఒక కేసులోనే 47 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ 11 కోట్ల 76 లక్షలు ఉంటుందంటున్నారు

సూర్యపేట జిల్లాలోనూ 15 కేసుల్లో 87 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ 21 లక్షల 66 వేలుగా ఉంటుందంటున్నారు పోలీసులు. యాదాద్రి జిల్లాలో 9 కేసుల్లో రెండున్నర కోట్ల విలువైన 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లాలోనూ 237 కేసుల్లో కోటి 88 లక్షల విలువ చేసే 1120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

కొత్తగూడెం జిల్లాలోనూ గత నెల వ్యాప్తంగా 34 కేసుల్లో 2 కోట్ల 80 లక్షలు విలువ చేసే 1664 కిలోల గంజాని పట్టుకున్నారు పోలీసులు. మేడ్చల్‌ మల్కాజి గిరి జిల్లాలోనూ 36 కేసుల్లో 25 లక్షల రూపాయలు విలువ చేసే 411 కేజీల గంజాయి పట్టుకున్నారు

ఇక హైదారాబాద్‌ జిల్లాలోనూ సినిమాటిక్‌ రేంజ్‌లో గంజాయి దందా చేస్తున్నారు కేటుగాళ్లు. గత నెల పరిధిలో 206 కేసుల్లో 2 కోట్ల 15 లక్షల 56 వేల విలువ చేసే 2167 కేజీల గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్‌ పరిధిలో 91 కేసుల్లో 2 కోట్ల 27 లక్షల 80 వేల విలువ 1923 కేజీల గంజాయి, డ్రగ్స్‌, హషీస్‌ అయిల్‌, అల్పోజోలం, వీట్‌ అయిల్‌, ఓపీఎం, ఎండిఎంఎ లాంటి డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఘట్కేసర్ పరిధిలోని 43 కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను భువనగిరి యాదాద్రి తొక్కాపూర్‌ లో ఉన్న హోం ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ బయోకెమికల్‌ కంపెనీలో డిస్పోజల్‌ చేశారు. మొత్తం 848 కేజీల గంజాయితోపాటు 3 ఎల్‌ఎస్‌డి బ్లాస్ట్స్‌, 50 ఎండిఎంఎ పిల్స్‌, 900 గ్రాముల ఆల్ఫాజోలం, 600 గ్రాముల క్లోరో హైడ్రేడ్‌, 700 గ్రాముల హాషిష్‌ అయిల్‌ను దాహనం చేసినట్లు తెలిపారు అధికారులు. వీటి విలువ సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని అంచనా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.