Telangana: ఏం టార్చర్ రా ఇది..! ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా?

ఫైనాన్స్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే, వాళ్ళు పెట్టే టార్చార్ మాములుగా ఉండదు..! ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేక, ఫైనాన్స్ ఏజెంట్ ముందే ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు.

Telangana: ఏం టార్చర్ రా ఇది..! ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా?
Bike Fire
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Nov 24, 2024 | 4:31 PM

ప్రస్తుతం ఎలాంటి రుణాలు తీసుకున్నా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. దీంతో నెలవారీ వాయిదా పద్ధతి ఈఎంఐ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇచ్చిన గడువులోపు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. కానీ, వాయిదాలు చెల్లించడం ఆలస్యమైతే నరకం చూడాల్సిందే..! లోన్ ఈఎంఐ గడువు ఒక్కరోజు ఆలస్యమైతే దానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

ఇక, ఫైనాన్స్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే, వాళ్ళు పెట్టే టార్చార్ మాములుగా ఉండదు..! ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేక, ఫైనాన్స్ ఏజెంట్ ముందే ఓ యువకుడు తన వద్ద ఉన్న బైక్‌ను తగలబెట్టేశాడు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుని ఓ టూవీలర్ బైక్‌ను కొనుగోలు చేశాడు.

ఈక్రమంలోనే ప్రతిసారి ఈఎంఐ డబ్బుల కోసం ఫైనాన్స్ ప్రతి నిధులు ఇంటికి రావడంతో మనోవేధనకు గురైన ఆ యువకుడు తన బైక్‌కు నిప్పంటించి దగ్ధం చేశాడు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన ఓ యువకుడు ప్రైవేట్ ఫైనాన్స్లో ఈఎంఐ పద్ధతిలో బైక్ కొనుగోలు చేశాడు. ఈఎంఐలు మొత్తం చెల్లించగా, ఇంకా ఐదు నుంచి ఆరు వేల బకాయి ఉందంటూ ఫైనాన్స్‌ సిబ్బంది చెల్లించాలంటూ కోరార. ఈ బకాయి కోసం ఫైనాన్స్ ప్రతినిధులు శనివారం(నవంబర్‌ 23) ఇంటికి రాగా, మనోవేధనకు గురైన యువకుడు వారి ముందే బైక్‌కు నిప్పంటించడంతో అది పూర్తిగా కాలిపోయింది. ఫైనాన్స్ వాళ్ళు పెట్టే వేధింపులు భరించలేకనే, ఈ బైక్‌ను తగలబెట్టాడని తెలుస్తోంది. కాగా మరోవైపు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…