ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌పై రేవంత్ సర్కార్ ఆగ్రహం.. కీలక అధికారి సస్పెన్షన్
ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మరణించగా.. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు.

ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మరణించగా.. చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. 92 మంది రోగులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన మంత్రి.. రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించాలని మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. డైయిట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజాన్ జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు.
అనారోగ్యం పాలైన వారిలో తీవ్రంగా ఉన్న 18 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. మిగతా రోగులని గాంధీ, ఉస్మానియాతో పాటు మొత్తం ఆరు వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని.. వారు మరో రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారని చెప్పారు.
ఇక్కడ డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు సైతం సరిగా లేదని సమాచారం అందిందని.. అతని కాంట్రాక్ట్ రద్దు చేశామని తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ. జరిగిన ఘటనపై ఒక కమిటీని నియమించాయని.. కమిటీ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
