AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మీరు వెళ్తే మీరు చేసే పని ఎవరు చేస్తారు.. ఉద్యోగుల స్టడీ లీవ్ కు అనుమతి నిరాకరణ

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మరికొన్ని శాఖల్లో ప్రకటనల విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్లకు...

Hyderabad: మీరు వెళ్తే మీరు చేసే పని ఎవరు చేస్తారు.. ఉద్యోగుల స్టడీ లీవ్ కు అనుమతి నిరాకరణ
Study
Ganesh Mudavath
|

Updated on: May 05, 2022 | 7:23 AM

Share

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మరికొన్ని శాఖల్లో ప్రకటనల విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్లకు నిరుద్యోగులే కాకుండా వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తరువాత ప్రమోషన్స్ పొందాలనో, స్థాయి పెంచుకోవాలనే లక్ష్యంతో కొందరు చదువును కంటిన్యూ చేస్తారు. వీరి ఆసక్తిని గమనించిన ప్రభుత్వం.. కొన్ని వెసులుబాట్లు కల్పించింది. తక్కువ స్థాయి విద్యార్హతలతో ఉద్యోగాలకు ఎంపికైన వారు డిగ్రీ చదివేందుకు, గ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఉద్యోగాలు పొందిన వారు పీజీ చదవాలనే లక్ష్యంతో ఉన్నత చదువులు అభ్యసించాలని భావిస్తారు. దీనికోసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు విద్యా సెలవుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు విద్యాసెలవు(Study Leave) మంజూరు చేస్తే.. వారి జీతాల్లో కటింగ్స్ లేకుండా చదువు కొనసాగించే వీలుంటుంది. అంతే కాకుండా ఉద్యోగానికి భద్రత ఉంటుంది. అయితే అనుమతులు ఇవ్వడానికి పై అధికారులు వెనుకాడుతున్నారు.

‘మీరు స్టడీ లీవ్ కు వెళ్తే ఆ పోస్టు ఖాళీగా ఉంటుంది. ఆ పని ఎవరు చేస్తారు’ అని ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించినా ఆ తర్వాత పై అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయంలోని కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతులు పొందాలి. ఉద్యోగులు సచివాలయానికి వచ్చి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోవాల్సి వస్తోంది. ఉద్యోగం ఉన్నాక మరలా.. ఉద్యోగం ఎందుకని ప్రశ్నిస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ఇలా సెక్రటేరియట్ లో వెయ్యికి పైగా స్టడీ లీవ్‌ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉండగా.. నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, కార్మిక, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, విద్య వంటి శాఖల్లోనూ సత్వరం అనుమతులు లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం భారీగాఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నతస్థాయి పోస్టుల పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే స్టడీ లీవ్‌ సమస్య గురించి తెలిసి కొంతమంది వెనుకాడుతుండగా.. మరికొందరు ఉద్యోగాలను వదిలేసి మరీ పరీక్షలు రాయాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Duggirala MPP: దుగ్గిరాల ఎంపీపీ పదవిపై ఉత్కంఠ.. కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు

Hindupuram: బాలయ్య ఇలాకాలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు