AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:పేరుకు బడాబాబులు.. చేసేదీ పాడు పనులు.. పత్తాలాడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలతో సహా బీజేపీ నేత!

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో క్రైమ్‌ రేట్‌ తగ్గాలి, డ్రగ్‌ ఫ్రీ సిటీగా మారాలి. ఇది హైదరాబాద్‌పై ప్రభుత్వం, పోలీసుల కసరత్తు. కాని కొన్ని ఘటనలు మాత్రం.. నగరాన్ని నీడలా వెంటాడుతున్నాయి.

Hyderabad:పేరుకు బడాబాబులు.. చేసేదీ పాడు పనులు.. పత్తాలాడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలతో సహా బీజేపీ నేత!
Arrest
Balaraju Goud
|

Updated on: May 05, 2022 | 7:36 AM

Share

Gamblers Arrest in Hyderabad: అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో క్రైమ్‌ రేట్‌ తగ్గాలి, డ్రగ్‌ ఫ్రీ సిటీగా మారాలి. ఇది హైదరాబాద్‌పై ప్రభుత్వం, పోలీసుల కసరత్తు. కాని కొన్ని ఘటనలు మాత్రం.. నగరాన్ని నీడలా వెంటాడుతున్నాయి. బంజారాహిల్స్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో పేకాట డెన్‌ బయటపడింది. ఏకంగా ఎమ్మెల్యేగాపోటీ చేసిన ప్రజా ప్రతినిధి పోలీసులకు పట్టుబడ్డాడు.

హైదరాబాద్ నగరంలో ఏరియాకో పోలీస్ స్టేషన్, గల్లీకో పోలీస్ వాహనం, నిత్యం డేగా కన్ను నిఘా. అయినా నగరం నడిబొడ్డున పత్తాలాడుతున్నారు జనాలు. ఏ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, పక్క ఫ్లాట్ వాళ్లకు కూడా తెలియకుండా హైటెక్ రేంజ్‌లో పేకాట ఆడుతున్నారు. ఏదో విధంగా పోలీసులకు సమాచారం అందింది. అంతే.. పోలీస్ టీమ్ ఒక్కసారిగా దాడి చేసింది. హుటాహుటిన వెళ్లి దాడి చేయడంతో బడాబాబుల బండారం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓ ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

ఊరి చివరనో.. లేదంటే ఏ శివారు ప్రాంతంలో అంటే పోలీసులకు దొరకకుండా ఉంటారనుకోవచ్చు. కాని వీళ్లు ఏకంగా బంజారాహిల్స్‌లోనే దుకాణం తెరిచారు. చూడటానికి అంతా బడాబాబుల మాదిరే ఉన్నారు. ఇందులో పోలీసులకు షాకింగ్ న్యూస్ ఏంటంటే దొరికివారిలో గతంలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి ఉన్నాడు. పేరు బండవల్లి సతీష్. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులను అరెస్ట్ చేసి ఏకంగా 17లక్షల 75 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న ఫ్లాట్ బండపల్లి సతీష్ సోదరుణుదిగా తెలుస్తోంది. బడాబాబులు, అందులో ఎమ్మెల్యేగా పోటీచేసిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాంటే కథ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించి ఇవాళ పోలీసులు మరింత కూపీ లాగే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడికి ఎవరెవస్తారు? అసలు ఈ ఫ్లాట్ ఎవరి పేరు మీదుంది? ఎప్పటి నుంచి ఇక్కడ పేకాట ఆడుతున్నారు వంటి సమాచారం బయటకు లాగనున్నారు పోలీసులు.