Hyderabad: తెలంగాణలో తొలి షోరూమ్‌ను ఓపెన్‌ చేసిన క్వాంటమ్‌ ఎనర్జీ.. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ప్రత్యేకతలేంటంటే.

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ క్వాంటమ్‌ ఎనర్జీ తమన డీలర్‌షిప్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. తెలంగాణలో మొదటి డీలర్‌షిప్‌ను క్వాంటమ్‌ ఎనర్జీ సంస్థ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఏర్పాటు చేసింది. ఈ డీలర్‌షిప్‌ను తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌..

Hyderabad: తెలంగాణలో తొలి షోరూమ్‌ను ఓపెన్‌ చేసిన క్వాంటమ్‌ ఎనర్జీ.. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ప్రత్యేకతలేంటంటే.
Quantum Energy
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2022 | 12:57 PM

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ క్వాంటమ్‌ ఎనర్జీ తమన డీలర్‌షిప్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. తెలంగాణలో మొదటి డీలర్‌షిప్‌ను క్వాంటమ్‌ ఎనర్జీ సంస్థ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఏర్పాటు చేసింది. ఈ డీలర్‌షిప్‌ను తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు. ఇదిలా ఉంటే క్వాంటమ్‌ ఎనర్జీ డీలర్‌షిప్‌లను త్వరలో సికింద్రాబాద్‌, వరంగల్‌లో కూడా ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఇప్పటికే ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. భారతదేశాన్ని పర్యావరణ అనుకూలంగా, హరిత దిశగా తీసుకెళ్తూ కార్బన్‌ ఉత్పత్తిని తగ్గించడానికి క్వాంటమ్‌ ఎనర్జీ చేస్తున్న కృష్టిని అభినందించారు. మరింత పర్యావారణ అనుకూలంగా మార్చేందుకు మరిన్ని విద్యుత్‌ వాహనాలను తయారు చేయాలని ఆయన కోరారు. విద్యుత్‌ ఆధారిత రవాణకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే క్వాంటమ్‌ ఎనర్జీ మొత్తం నాలుగు ఈవీ స్కూటర్లను తీసుకొచ్చింది. ప్లాస్మా, ఎలక్ట్రాన్‌, మిలన్‌, బిజినెస్‌ పేరుతో స్కూటర్లను తీసుకొచ్చింది. ప్లాస్మాలో 1500 వాట్‌ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 60 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రాన్‌, మిలన్‌లు 1000 వాట్‌ మోటర్‌ పవర్‌తో వస్తాయి. గంటకు 50 కి.మీల వేగంతో దూసుకెళ్తాయి. ఈ స్కూటర్లలో అత్యాధుని లిథియం, అయాన్‌ బ్యాటరీలను అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..