AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PIB Fact Check: నిరుద్యోగులకు కేంద్రం రూ. 6 వేల నిరుద్యోగ భృతి ఇస్తోందా.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత.

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం ఎంత వేగంగా బదిలీ అవుతుందో నకిలీ సమాచారం అంతే వేగంగా బదిలీ ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో నెటిజన్లను మోసం చేస్తున్న సంఘటనలను రోజుకోకి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో...

PIB Fact Check: నిరుద్యోగులకు కేంద్రం రూ. 6 వేల నిరుద్యోగ భృతి ఇస్తోందా.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత.
Representative Image
Narender Vaitla
|

Updated on: Dec 09, 2022 | 11:13 AM

Share

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం ఎంత వేగంగా బదిలీ అవుతుందో నకిలీ సమాచారం అంతే వేగంగా బదిలీ ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో నెటిజన్లను మోసం చేస్తున్న సంఘటనలను రోజుకోకి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఓ మోసపూరిత న్యూస్‌ వైరల్‌ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు రూ. 6000 భృతి ఇస్తోందనేది సదరు వార్త సారంశం. ప్రస్తుతం ఈ న్యూస్‌ వాట్సాప్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

ప్రధాన మంత్రి బెరోజ్‌గర్‌ భట్‌ యోజన పథకం కింద ఈ భృతి ఇస్తున్నారని అర్హత ఉన్న అభ్యర్థులు లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సదరు మెసేజ్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం ఓ లింక్‌ను కూడా షేర్‌ చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా తెలిపింది. భారత ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదని ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయవద్దని సూచించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ ద్వారా నకిలీ పథకాల గురించి తెలియజేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ‘ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ 2 లక్షల 20 వేల రూపాయలు ఇవ్వనుందని వైరల్‌ అయిన వార్తను పీఐబీ ఖండించింది. ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే ప్రతీ వార్తను గుడ్డిగా నమ్మకూడదని, నిజా నిజాలు తెలియకుండా ఇతరులకు ఫార్వర్డ్‌ చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??