PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ అమౌంట్ పెంచుతున్న మోదీ సర్కార్.. ఏంతంటే..

పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పెద్ద ప్రకటన చేయవచ్చు. అప్‌డేట్‌లు ఇక్కడ తెలుసుకుందాం.

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ అమౌంట్ పెంచుతున్న మోదీ సర్కార్.. ఏంతంటే..
Pm Kisan Update
Follow us

|

Updated on: Dec 09, 2022 | 11:42 AM

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు బిగ్ న్యూస్ రాబోతోంది. రైతును రాజును చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మోదీ సర్కార్ దూసుకుపోతోంది. రైతులకు మరింత ఆర్ధికంగా ఆదుకునేందుకు ఓ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి, రెండవ టర్మ్ ఐదవ బడ్జెట్‌ను సమర్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి  కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మధ్య, ఈసారి బడ్జెట్ రైతులకు ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

పీఎం కిసాన్ యోజన మొత్తం పెరుగుతుంది..

వాస్తవానికి, ద్రవ్యోల్బణం కొత్త రికార్డుల మధ్య, ప్రజలు ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పెద్ద ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అయితే, మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులైతే.. ఈ  మీ ఆదాయం కూడా రెట్టింపు కావచ్చు.

భారీ ప్రకటన రావొచ్చు..

రాబోయే బడ్జెట్ 2023లో, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఏటా వచ్చే రూ.6,000 మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. నిజానికి ఈ పథకం కింద చాలా రెట్లు పెంచాలనే డిమాండ్ ఉంది. అంతకుముందు, సాధారణ బడ్జెట్ 2022లో కూడా, కిసాన్ యోజన వాయిదా మొత్తాన్ని పెంచాలనే డిమాండ్ పూర్తి స్వింగ్‌లో ఉంది. అయితే ఈసారి బడ్జెట్‌లో ఈ పథకం మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచి, రైతులకు ఏడాదికి 4 విడతలుగా 2 వేల రూపాయల చొప్పున ఇవ్వవచ్చని కూడా చర్చి జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

సంవత్సరానికి 3 వాయిదాలు..

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఒకటి. దీని కింద దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం వారి ఖాతాలో మూడు విడతలుగా 2-2 వేల రూపాయలు అంటే ఏటా 6 వేల రూపాయలను జమ చేస్తోంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 12 విడతలుగా రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇప్పుడు 13వ విడత కోసం రైతులు జమకానుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని పెంచితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం