Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్‌.. ఆదివారం నిలిచిపోనున్న MMTS సేవలు.. పూర్తి వివరాలు ఇవే..

|

Aug 11, 2022 | 2:53 PM

Hyderabad: హైదారాబాదీల రవాణ కష్టాలను తీర్చుతూ అందరికీ అందుబాటులో ఉండే MMTS సేవలు వచ్చే ఆదివారం నిలిచిపోనునన్నాయి. ఆపరేషనల్‌ కారణాలతో కొన్ని రూట్స్‌లో రైలు సేవలు ఆగిపోనున్నాయి. అవేంటంటే..

Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్‌.. ఆదివారం నిలిచిపోనున్న MMTS సేవలు.. పూర్తి వివరాలు ఇవే..
MMTS Trains
Follow us on

Hyderabad: ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ సురక్షితమైన ప్రయాణం అందిస్తున్న వాటిలో MMTS ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుందననడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సేవలపై చాలా మంది ఆధారపడుతుంటారు. నగరం శివారుల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇదిలా ఉంటే నిర్వీరామంగా కొనసాగే ఈ సేవలు కొన్ని రోజుల్లో ఆపరేషనల్‌ కారణలతో నిలిచి పోతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే ఆదివారం (14-08-2022) కూడా పలు ఎంఎంటీఎస్‌ సేవలను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం 34 సేవలు రద్దు కానున్నాయి. ఏయే రూట్స్‌లో రైళ్లు ఆగిపోనున్నాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 రైల్‌ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 రైళ్లు ఆగిపోనున్నాయి.

ఇవి కూడా చదవండి

* ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 47153, 47164, 47165, 47166, 47203, 47220, 4710 రైళు సేవలు నిలిచిపోనున్నాయి.

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 రైళ్లు ఆగిపోనున్నాయి.

* వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే 47150 రైలు, లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 47195 రైలు సేవలు ఆగిపోనున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..