Viral Video: అక్కడెలా పెట్టావు బ్రో.. ఇంటి కాంపౌండ్‌ గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా?

జులాయి మూవీలో అక్కడెలా పెట్టావ్‌ అనే డైలాగ్‌ మీకు గుర్తుందా.. ఇక్కడ జరిగిన ఒక సంఘటన చూస్తే మీకు ఎక్స్యాక్ట్‌గా అదే డైలాగ్‌ గుర్తుకు వస్తోంది. నిద్రమత్తులో ఒక డ్రైవర్‌ తన డ్రైవ్‌ చేస్తున్న కారును ఏకంగా ఒక ఇంటి ముందు ఉన్న కంపౌండ్‌ గోడపైకి ఎక్కించేశాడు. ఉదయం నిద్ర లేచి చూసి సదురు ఇంటి యజమానులు షాక్‌ అయ్యారు.

Viral Video: అక్కడెలా పెట్టావు బ్రో.. ఇంటి కాంపౌండ్‌ గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా?
Viral Video

Updated on: Jul 25, 2025 | 3:53 PM

జులాయి మూవీలో అక్కడెలా పెట్టావ్‌ అనే డైలాగ్‌ మీకు గుర్తుందా.. ఇక్కడ జరిగిన ఒక సంఘటన చూస్తే మీకు ఎక్స్యాక్ట్‌గా అదే డైలాగ్‌ గుర్తుకు వస్తోంది. నిద్రమత్తులో ఒక డ్రైవర్‌ తన డ్రైవ్‌ చేస్తున్న కారును ఏకంగా ఒక ఇంటి ముందు ఉన్న కంపౌండ్‌ గోడపైకి ఎక్కించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును కిందకు దించారు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్‌ శివారులోని దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చ‌ల్ జిల్లాకు చెందిన శంభీపూర్ అనే వ్యక్తి రాత్రి సమయంలో నిద్ర‌మ‌త్తులో తను డ్రైవ్ చేస్తన్న కారును రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంటి కంపౌండ్‌ వాల్‌పైకి ఎక్కించాడు.

ఇలా గోడపైకి దూసుకొచ్చిన కారు.. దని చివరి వరకు వచ్చి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన శబ్ధం విన్న స్థానిక ఇంటి యజమానులు ఒక్కసారిగా నిద్రలేచి బయటకు వచ్చారు. ఇంటి గోడపై కారు ఉండడాన్ని చూసి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఉదయం క్రేన్‌ సహాయంతో కారును గోడపై నుంచి తొలగించిన పోలీసులు పీఎస్‌కు తరలించారు.

వీడియో చూడండి..

కారు గోడపై ఎక్కడాన్ని స్థానికులందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమైన రీతితో కామెంట్స్‌ చేస్తున్నారు. అస‌లు అక్క‌డ ఎలా పెట్టావ్ బ్రో అని కొందరు కామెంట్స్‌ చేయగా.. ఇంకో పెగ్‌ వేస్తే కారును ఎలా పెట్టాడో అలానే కిందకు తీసేవాడని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి