Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలెర్ట్‌.. బుధవారం ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

|

Dec 11, 2023 | 7:38 PM

Hyderabad Water Supply: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు - 3 లో కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ హెడర్ పైపు లైనుకు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలెర్ట్‌.. బుధవారం ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
Drinking Water Supply
Follow us on

Hyderabad Water Supply: హైదరాబాదీలకు బిగ్‌ అలెర్ట్‌.. నీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు జలమండలి కీలక సూచనలు ఇచ్చింది. బుధవారం (డిసెంబర్‌ 13) నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారమే (డిసెంబర్‌ 11) జలమండలి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు – 3 లో కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ హెడర్ పైపు లైనుకు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా గురువారం (డిసెంబర్‌ 14) ఉదయం 5 గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జల మండలి అధికారులు ప్రకటించారు.

నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే..

1. ఓ అండ్ ఎం డివిజన్ – 1 : శాస్త్రిపురం

2. ఓ అండ్ ఎం డివిజన్ – 2 : బండ్లగూడ

ఇవి కూడా చదవండి

3. ఓ అండ్ ఎం డివిజన్ – 3 : భోజగుట్ట, షేక్ పేట్

4. ఓ అండ్ ఎం డివిజన్ – 4 : ఆళ్లబండ

5. ఓ అండ్ ఎం డివిజన్ – 6 : జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా

6. ఓ అండ్ ఎం డివిజన్ – 7 : లాలాపేట్ పాక్షిక ప్రాంతాలు

7. ఓ అండ్ ఎం డివిజన్ – 10 : సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్

8. ఓ అండ్ ఎం డివిజన్ – 13 : సైనిక్ పురి, మౌలాలి

9. ఓ అండ్ ఎం డివిజన్ – 14 : స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్

10. ఓ అండ్ ఎం డివిజన్ – 15 : గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్

11. ఓ అండ్ ఎం డివిజన్ – 16 : మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్

12. ఓ అండ్ ఎం డివిజన్ – 18 : కిస్మత్ పూర్, గంధం గూడ

13. ఓ అండ్ ఎం డివిజన్ – 19 : బోడుప్పల్, మల్లికార్జున నగర్, మానిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదీగూడ

14. ఓ అండ్ ఎం డివిజన్ – 20 : ధర్మసాయి

కావున పైన పేర్కొన్న ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత తాగునీటి సరఫరా జరగుతుందని సూచించింది. ఈ విషయంలో నగరవాసులు తమకు సహకరించాలని జలమండలి అధికారులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..