Hyderabad: కరోనాకు మందు కనిపెట్టానంటూ డాక్టర్‌ హల్‌చల్‌.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదంటూ పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన

|

Dec 06, 2022 | 1:19 PM

కరోనాకు మందు కనిపెట్టిన తనను ప్రభుత్వం ప్రోత్సహించాలని డాక్టర్ కోరుతున్నాడు. తాను చేసిన మందుతో కేవలం ఐదు రోజుల్లో కరోనాను నయం చేయవచ్చంటున్నాడు.

Hyderabad: కరోనాకు మందు కనిపెట్టానంటూ డాక్టర్‌ హల్‌చల్‌.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదంటూ పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన
Doctor
Follow us on

నగరంలోని సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తోన్న డాక్టర్ వసంత్ హంగామా సృష్టించాడు. కరోనాకు మందు కనిపెట్టినా కూడా తనకు ఉన్నతాధికారులు సహకరించడం లేదంటూ అర్ధరాత్రి నుంచి నిరసనకు దిగాడు. తన రూమ్‌లోకి పెట్రోల్‌ బాటిల్‌ తీసుకుని వెళ్లిన ఆయన బయటకు రాకుండా గడియపెట్టుకున్నాడు. కరోనాకు మందు కనిపెట్టిన తనను ప్రభుత్వం ప్రోత్సహించాలని డాక్టర్ కోరుతున్నాడు. తాను చేసిన మందుతో కేవలం ఐదు రోజుల్లో కరోనాను నయం చేయవచ్చంటున్నాడు. అంతేగాక ఈ మందు కేవలం రూ.45లకే అందుబాటులో ఉందంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్.. మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో గాంధీ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా చేసిన ఆయన బదిలీపై సుల్తాన్ బజార్‌కి వచ్చారు.

కాగా వైద్యుడి ఆందోళన గురించి తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాక్టర్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి